పసిడి ప్రియులు, మహిళలకు చేదు వార్త. కొన్ని రోజుల నుండి తగ్గుతూ వస్తూ ఆశలు కురిపించిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుండి వీటి ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. బంగారం కొనాలనుకున్న వారికి.. ఈ చేదు వార్త అడియాశగా మారింది.
బంగారం, బంగారంతో చేసే నగలు ఇష్టపడని ఆడవాళ్లు ఉండరు. వేడుకలేదైనా కచ్చితంగా బంగారు ఆభరణాలు ధరించి మెరవాల్సిందే. స్వకార్యం.. స్వామి కార్యం కిందకు బంగారం పనికి వస్తుండటంతో మహిళలే కాదూ మగవారు సైతం బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిన్న చిన్న ఆర్థిక పరమైన సమస్యలు వచ్చినప్పడు అవసరానికి అక్కరసు వస్తుంటాయి నగలు. అంతేకాకుండా బంగారం, వెండి నగలు ప్రస్తుతం ప్రెస్టేజ్‌గా కూడా భావిస్తుండటంతో వీటి అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. అయితే కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న గోల్డ్, సిల్వర్ ధరలు ఇప్పుడు ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాయి.
నాలుగు రోజుల నుండి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల్లో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1550 మేర పెరిగింది. వెండి రూ.2000లకు పైగా ఎగబాకింది. బంగారం దారిలోనే వెండి కూడా పోతోంది. వివిధ నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు రూ.320 పెరిగి.. రూ. 57, 370 వద్ద కొనసాగుతుంది. అటు 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.290 పెరిగి ప్రస్తుతం రూ.52 వేల 600 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ. 330 పెరిగి రూ. 66 వేలకు చేరింది. ఇక హైదరాబాద్ లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ. 330 మేర పెరిగి రూ. 57,220 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.290 పెరిగింది. ప్రస్తుతం రూ.52,450 వద్ద ఉంది.
ఇక హైదరాబాద్ లో వెండి ధరలను పరిశీలిస్తే నాలుగు రోజుల్లోనే కిలో ధర రూ.2000వేలకుపైగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 800 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ.69,500లకు చేరింది. హైదరాబాద్ తరహాలోనే విజయవాడలో ధరలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సైతం బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు ప్రస్తుతం 1912 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది కొద్ది రోజుల క్రితం 1800ల వరకు పడిపోయిన విషయం తెలిసింది. ఇక స్పాట్ సిల్వర్ ఔన్సుకు 21.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. భారత రూపాయి మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూ.82.393 వద్ద ఉంది.