కరోనా వైరస్ నేపథ్యంలో కృష్ణపట్నం ఆనందయ్య మందు ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. కోవిడ్-19 రోగుల ప్రాణాలు రక్షిస్తున్న ఆ మందు వెనుక రహస్యాన్ని తెలుసుకుని ఆయుష్ విభాగం, ఆయుర్వేద నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్ధరించారు. కంటిలో వేసే మందు తప్ప మిగతావన్నీ రోగులకు అందివచ్చని షరతు విధించింది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున మిగతా ఔషదాలకు అనుమతి ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆనందయ్య మందును కంట్లో వేయగానే ఆక్సిజన్ స్థాయిలు అమాంతంగా ఎలా పెరుగుతున్నాయి? కంట్లో వేసే ఆ మందు సురక్షితమైనదేనా? గతంలో ఎప్పుడైనా దీన్ని ఉపయోగించారా? అనే సందేహాలకు ఢిల్లీ ఎంసీడీ ఆయుష్ విభాగం చీఫ్ మెడికల్ ఆఫీసర్, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కామేశ్వరరావు చెప్పిన ఈ ఆసక్తికర విషయాలు తెలియజేసారు. ఆ మందు వేసుకున్న కోటయ్య ఎందుకు మృతి చెందాడు. మన శరీరంలో ఫాస్టెస్ అబ్జర్వేటివ్ రూట్ – కంటి పొర. అక్కడ మందు వేస్తే అది వెంటనే మెదడుకు చేరుతుంది కాబట్టి ఆ మందును కంట్లోనే వేస్తారు. వెనుకటి కాలంలో మందులు లేనప్పుడు పసర్లు పోసేవాళ్లు. పాము కాటు వల్ల మెదడుకు ఆక్సిజన్ లెవల్స్ అందకపోతే మరణిస్తారు. కాబట్టి చివరి ప్రయత్నంగా పసరు పోసి ప్రాణం నిలబెట్టేవారు.
ఆ క్రమంలో ఆక్సిజన్ స్థాయిలు బాగా పడిపోయిన తర్వాత కోటయ్యను ఆనందయ్య వద్దకు తీసుకొచ్చారు. మందు వేయగానే ఆక్సిజన్ స్థాయిలు పెరిగాయి. అయితే, ఆ వెంటనే కోటయ్యను ఇంటికి కాకుండా అలోపతి వైద్యాన్ని తిరిగి కొనసాగిస్తే ఆయన బతికేవారేమో. ఎందుకంటే ఆ మందు కేవలం బ్రెయిన్‌కు మాత్రమే ఆక్సిజన్ అందిస్తుంది. ఊపిరితీత్తులకు కాదు. కరోనా ప్రభావం చాలా తక్కువ, సాధారణంగా ఉండే వ్యక్తులకే ఇది బాగా పనిచేస్తుంది. తీవ్రంగా ఉండేవారికి తాత్కాలిక ఉపశమనం కలిగినా అలోపతి వైద్యంతో చికిత్స పొందాలి. కానీ, ఆనందయ్య మందును వేసుకోగానే కరోనా తగ్గిపోయిందనే భావించి ఇంటికి వెళ్లిపోతున్నారు. దీనిపై ఆయుర్వేదం, అలోపతి సంయుక్తంగా అధ్యయనం చేయాలి. ఆనందయ్య మందు ఆక్సిజన్ అందిస్తున్న నేపథ్యంలో అలోపతి వైద్యం ద్వారా ఆ రోగులు త్వరగా కోలుకోనేలా వైద్యులు ప్రయత్నించాలి. ఆనందయ్య మందు కూడా ఇప్పుడు ఆక్సిజన్ పెంచేందుకు ఉపయోగిస్తున్న అలోపతి మందులు, 2డీ మందుల తరహాలోనే పనిచేస్తుంది. ఈ మందును మేం కూడా తయారు చేసి ప్రయత్నించాం. ఆక్సిజన్ స్థాయిలు పెరగడాన్ని గమనించాం. ఆయుర్వేదంలో కూడా ఇలాంటి చికిత్స ఒకటి ఉంది. దాని ప్రకారం తమిళనాడుకు చెందిన ఓ రోగిపై ప్రయోగం చేశాం. ఆమె ఆక్సిజన్ స్థాయిలు పెరిగడంతో లేచి కూర్చున్నారు. కాబట్టి ఆక్సిజన్ పెంచుకోడానికి ఆయుర్వేదంలో కూడా డ్రగ్స్ ఉన్నాయి. వ్యక్తిగతంగా చెప్పాలంటే , ఆనందయ్య మందు తయారీ కోసం వాడే విధానాన్ని అభినందించాల్పిందే. ఆయన మందుల్లో వాడే మూలికలు, పదార్ధాలు హానికరం కాదు అని డాక్టర్ కామేశ్వరరావు పేర్కొన్నారు.