సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు.. పెట్రోల్ తో నడిచే వాహనాలు హీటెక్కిపోతుంటాయి. ఎక్కడ పార్క్ చేసినా, వేడిగాలి తగిలినా బైక్, స్కూటీలలో పెట్రోల్ ఆవిరి అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఎండలో బండి పెడితే.. కొందరు సీట్ కాలుతుందని నీడలో పెట్టామంటారు. మరికొందరేమో ఎండకు పెట్రోల్ ఆవిరి అయిపోతుందని నీడలో పెడుతున్నాం అంటారు. కానీ అందరిలో సాధారణ సందేహం మాత్రం.. ఎండలో బైక్ పెడితే పెట్రోల్ ఆవిరి అవుతుందా? లేదా? అనేది.
ఈ సందేహంతో రోజూ తికమక పడుతుంటారు వాహనదారులు. ఈ అనుమానాలకు సమాధానం ఎవరిస్తారా? అని చూస్తుంటారు. సోషల్ మీడియా వెతికితే.. ఎవరెవరో ఎన్నో చెబుతుంటారు. కానీ ఒక్కరూ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వరని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా బైక్ లో పెట్రోల్ ఎండ ఎఫెక్ట్ కి ఆవిరి అవుతుందా లేదా? అనే విషయం పై ఓ పెద్దాయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెత్తింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
