డయాబెటిస్ లేదా షుగర్ ఈ పదం ఎందరో జీవితాల్లో సంతోషాన్ని హరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధితో కోట్ల మంది బాధపడుతున్నారు. ప్రపంచంలో కెల్లా భారత్ లోనే ఎక్కువ టైప్-2 డయాబెటిస్ బాధితులు ఉన్నారనే లెక్కలు కలవరపెడుతున్నాయి. 2040 నాటిని భారత్ లో టైప్-2 డయాబెటిక్స్ బాధితుల సంఖ్య 140 మిలియన్లకు చేరుతుంది అంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా.. అప్పుడే పుట్టిన బిడ్డపై కూడా ఈ డయాబెటిస్ పంజా విసురుతోంది. అయితే ఈ మహమ్మారిని అంతం చేయలేకపోయినా ఈ సింపుల్ డైట్ తో కంట్రోల్ చేయవచ్చు.
చక్కెర విషయంలో బిఅలర్ట్
కేవలం తీపి పదార్థాలు తినడం వల్లే షుగర్ లెవల్స్ పెరుగుతాయి అనుకోవడం అపోహ మాత్రమే. అత్యధిక కొవ్వు కలిగి ఉన్న పదార్థాల్లోనూ తీపి ఎక్కువగా ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు. ఫ్యాట్, తీపి ఎక్కువగా ఉండే ఆహారం వల్ల బరువు ఎక్కవగా పెరుగుతారు. అలా జరిగితే శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి మధుమేహానిక దారి తీస్తుంది.
ప్రోటీన్ + కార్బోహైడ్రేట్లు
డయాబెటీస్ తో బాధపడేవారు కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకోకూడదని పూర్తిగా దూరం పెట్టేస్తారు. అయితే అలా చేయకుండా వాటిని మరో మార్గంలో తీసుకుంటే ఎంతో మేలు చేస్తాయి. కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. హోల్ వీట్ ఆటా, గోధుమ రవ్వ, జొన్న, రాగులు, బ్రౌన్ రైస్ వంటివి బ్లడ్ లో గ్లూకోజ్ ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. అందుకే వాటినే ఎక్కువ ప్రఫర్ చేస్తారు. కానీ, కార్బోహైడ్రేట్లను ప్రోటీన్లతో కలిపి తీసుకుంటే గ్లూకోజ్ మరింత నెమ్మదిగా విడుదల చేస్తాయి.
ప్రోటీన్లు కూడా ముఖ్యమే
డయాబెటిస్ ను అదుపులో ఉంచాలంటే ఆరోగ్యకర ప్రొటీన్లు తీసుకోవడం కూడా ముఖ్యమే. అవి ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతాయి. అయితే అధిక ప్రోటీన్లు ఉండే ఆహారంలో కొవ్వు కూడా ఉంటుంది. ఫ్యాట్ తక్కువగా, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
ఒత్తిడి కూడా రక్తంలో చక్కెరస్థాయి పెంచుతుంది. అందుకే సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండాలి. అంతే కాకుండా షుగర్ లెవల్స్ ఎప్పుడూ అదుపులో ఉండాలంటే తప్పకుండా వ్యాయామం చేయాలి. వయసును బట్టి వ్యాయామ సమయం, పద్ధతులను ఎంపిక చేసుకోవాలి. కాస్త వయసులో పెద్దవారు రోజూ నడకను అలవాటు చేసుకోవాలి. చక్కని జాగ్రత్తలతో మధుమేహాన్ని తప్పకుండా కంట్రోల్ చేయవచ్చు.