గతంలోనే కాదు.. ప్రస్తుతం కూడా సాఫ్ట్‌వేర్ జాబ్‌కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో అందరికీ తెలిసిందే. సాంకేతికత కొత్త పుతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువయ్యాయి. గతంలో అంటే సాఫ్ట్ వేర్ జాబ్ ఇంజినీరింగ్ చేయాలి, ఎంఎస్ చేయాలి అని ఉండేది. ఇప్పుడు డిగ్రీ అర్హతతో చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కూడా చాలానే ఉన్నాయి. అలా డిగ్రీ అర్హతతో సాఫ్ట్ వేర్ ఫీల్డ్‌లోకి ఎంటర్ కావాలి అనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి అవకాశాలా కల్పిస్తున్నారు. ఆ వివరాలు? విద్యార్హతలు? ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ జెన్‌పాక్ట్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
జెన్ పాక్ట్ సంస్థ హైదరాబాద్ బ్రాంచ్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాసెస్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేసేందుకు పిలుపునిచ్చింది. ఈ ఉద్యోగానికి అప్లై చేసే ఔత్సాహికులు ఏదీనీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఉండాలి. అలాగే వారికి రైటింగ్ స్కిల్ కూడా ఉండాలని చెబుతున్నారు. అవసరం, అవకాశాన్ని బట్టి ఒక్కోసారి వారాంతాల్లో కూడా పనిచేయాల్సి రావచ్చని చెబుతున్నారు. ఈ అర్హతలు ఉంటూ కొత్త విషయాలను నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉండే ఔత్సాహికులు తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఒక్క జెన్ పాక్ట్ లోనే కాకుండా.. టీసీఎస్ లోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. టీసీఎస్ సంస్థ బీపీఎస్ హైరింగ్ 2022 పేరిట ఉద్యోగాల భర్తీ చేస్తోంది. క్యాంపస్ డ్రైవ్ ద్వారా ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఈ అవకాశాలను కల్పిస్తోంది. అందుకు సంబంధించిన ప్రకటనను కూడా జారీ చేశారు. ఔత్సాహికులు, అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసేందుకు 2020, 2021, 2022 సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అయి ఉండాలి. రెగ్యూలర్ డిగ్రీ స్టూడెంట్స్ మాత్రమే అర్హులు. పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అనర్హులుగా చెప్పారు.
అభ్యర్థుల వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ముందు పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్షలో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 80 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వాటిని 65 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీకి సంబంధించి 24 ప్రశ్నలు ఉంటాయి. వాటిని పూర్తి చేసేందుకు 26 నిమిషాల సమయం ఉంటుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 26 ప్రశ్నలు ఉంటాయి. పూర్తి చేసేందుకు 20 నిమిషాల సమయం ఉంటుంది. రీజనింగ్ లో 25 నిమిషాల్లో 30 ప్రశ్నలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో మీరు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం, ఉద్యోగ అవకాశం మాత్రం మీ మెరిట్, మీ ప్రదర్శన బట్టే ఉంటుందని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.