బంగారం లాంటి సంసారంలో నిప్పులు పోస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు. చాలీ చాలని జీతం, వేతనానికి మించి పెరిగిపోతున్న ఖర్చులు, ఆర్థికావసరాలు సగటు మనిషిని అప్పులు చేసేలా పురిగొల్పుతున్నాయి. తీసుకున్నప్పుడు ఎలాగోలా కడదామన్నా హోప్స్‌తో అప్పులు చేసి కొంపలకు తిప్పలు తెచ్చుకుంటున్నారు.
బంగారం లాంటి సంసారంలో నిప్పులు పోస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు. చాలీ చాలని జీతం, వేతనానికి మించి పెరిగిపోతున్న ఖర్చులు, ఆర్థికావసరాలు సగటు మనిషిని అప్పులు చేసేలా పురిగొల్పుతున్నాయి. వీటికి కారణమౌతున్నాయి ఆన్ లైన్ మోసాలు. తీసుకున్నప్పుడు ఎలాగోలా కడదామన్నా హోప్స్‌తో అప్పులు చేసి కొంపలకు తిప్పలు తెచ్చుకుంటున్నారు. చివరకు అసలు కాదు కదా వడ్డీ కట్టలేని పరిస్థితులు వస్తాయి. దీంతో వడ్డీ మీద వడ్డీ వేసి చక్రవడ్డీకి, అసలు కలిపి పెద్ద భారంగా మారుతుంది. దీంతో అప్పులు ఇచ్చిన వ్యక్తులు డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకురావడం మొదలు పెడతారు. వాటిని కట్టలేక, భార్యా బిడ్డలను పస్తులు ఉంచలేక.. అనేక మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కొందరైతే.. తాము చేసిన తప్పులకు పిల్లల్ని బలితీసుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన దంపతులు అప్పులు బాధ తాళలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.
భోపాల్ నగరంలోని విషాద ఘటన చోటుచేసుకుంది. నీల్ బాద్ ప్రాంతానికి చెందిన దంపతులు, తమ పిల్లలకు విషమిచ్చి.. ఆపై వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. మృతుడు ఓ ప్రైవేట్ ఇన్సురెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరికి 8, 3 సంవత్సరాల వయస్సున పిల్లలున్నారు. హాయిగా సాగిపోతున్న సంసారానికి అప్పులు తిప్పలు తెచ్చిపెట్టాయి. సూసైడ్ నోట్‌లో తాను పడ్డ కష్టం గురించి రాసుకొచ్చాడు బాధితుడు. ‘ఏం చేయాలో, ఏమి చేయకూడదో నాకు అర్థం కావడం లేదు, మా చిన్న, అందమైన కుటుంబానికి ఏమి జరిగిందో నాకు తెలియదు. మా కుటుంబ సభ్యులకు మేము క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాము. నేను చేసిన తప్పు కారణంగా, నా వారందరినీ చాలా ఇబ్బంది పెట్టాను’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
‘మేము మా కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాము. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఏప్రిల్‌లో, ఆన్‌లైన్ జాబ్ అంటూ నా ఫోన్‌కు మేసేజ్ వచ్చింది. తర్వాత టెలిగ్రామ్‌లో మరొక సందేశం వచ్చింది. అయితే నాకున్న ఆర్థిక అవసరాల నిమిత్తం, నేను ఆ అదనపు పని కోసం అంగీకరించాను. మొదట్లో డబ్బులు బాగా రావడం మొదలుపెట్టాయి.కానీ క్రమ క్రమంగా పని భారం పెరిగి.. ఒత్తిడికి గురయ్యాను. చివరకు అందులో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాను. తర్వాత ఆర్డర్ పూర్తి చేసి నా కమీషన్ (డబ్బు) విత్‌డ్రా చేయమని మెసేజ్‌లు వచ్చాయి. కానీ చేయలేకపోయా. నా దగ్గర డబ్బు మొత్తం అయిపోవడంతో, కంపెనీ నన్ను లోన్ తీసుకోమని ఒత్తిడి చేసింది. క్రెడిట్ స్కోర్ బాగోకున్నా కంపెనీ ఒత్తిడితో అప్పులు చేశాను’ అని పేర్కొన్నారు.
తన భార్య చెబుతున్నా వినిపించుకోకుండా ఆన్ లైన్ మోసానికి బలై.. అప్పులు చేసి..అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తనను మోసగాళ్లు తన ఫోన్ హ్యాక్ చేసి బెదిరించడం మొదలు పెట్డడంతో ఏం చేయాలో తోచక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో రాశారు. చివరకు అప్పుల కోసం తమ కుటుంబ సభ్యులతో సహా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టవద్దని వేడుకున్నాడు. అందరికీ క్షమాపణలు చెప్పాడు. చివరకు సెల్ఫీ తీసుకుని బంధువులకు పంపాడు. అనంతరం పిల్లలకు విషమిచ్చి.. దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.