ఫిల్మ్ డెస్క్- కోవై సరళ.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కామేడీ పాత్రలకు పెట్టింది పేరు కోవై సరళ. అందులోను తెలుగు కామెడీ స్టార్ బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్ సూపర్ హిట్ అని చెప్పవచ్చు. కోవై సరళ ఇప్పటిదాకా దాదాపు 750 సినిమాల్లో నటించారు. ఎంజీఆర్ సినిమాలను చూసి సినిమాల్లో నటించాలని కోరికతో ఈ రంగంలోకి వచ్చారట కోవై సరళ.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ హాస్యనటి పురస్కారాలను కోవై సరళ మూడుసార్లు అందుకోవడం విశేషం. కోవై సరళ ఏప్రిల్ 7, 1962లో తమిళనాడు లోని కోయంబత్తూర్లో జన్మించారు. చిన్న తనంలోనే తమిళ సినిమా రంగంలోకి అరంగెట్రం చేశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత కొన్నేళ్లకే గర్భిణిగా, ముసలావిడగా వయస్సుకు మించిన పాత్రల్లో నటించి మెప్పించారు కోవై సరళ. సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవరిస్తున్నారు.
కోవై సరళ పాసా పరవైగల్ అనే రియాలిటీ షోను కూడా నిర్వహించింది. తమిళ టీవీ చానల్ విజయ్ టీవీలో ప్రసారమయ్యే తమిళ కామెడీ షో కామెడిల్ కలకువత్తు ఎప్పాడి కు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా 58 ఏళ్ల వయసున్న కోవై సరళ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను కోవై సరళ చెప్పుకొచ్చింది.
తమ కుటుంబంలో కోవై సరళ పెద్ద కుమార్తె కావడంతో భాద్యతలన్నీ ఆమెపై పడ్డాయి. కోవై సరళకు నలుగురు చెల్లెల్లు ఉన్నారు. దీంతో వారిని పెంచి పెద్ద చేసి, వారికి ఆమె పెళ్లిళ్లు చేసింది. అంతే కాదు చెల్లేల్ల పిల్లలకు చదువు కూడా ఆమె చెప్పించింది. అందులో ఇద్దరికి పెళ్లి కూడా కోవై సరళే జరిపించింది. ఇలా కుటుంబ భాద్యతల్లో మునిగిపోయి పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. అంతే కాదు తనకు ఒంటరికిగా ఉండడం ఇష్టమని అప్పుడప్పుడు చెబుతుంది కోవై సరళ.