చెన్నై- ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్బంగా, ఆయన భద్రతకు భంగం కలగడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మోదీకి పంజాబ్ ప్రభుత్వం తగిన భద్రత కల్పించలేదని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని మోడీకే భద్రత కల్పించలేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని కామెంట్స్ దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మోడీ వ్యతిరేక వర్గం మాత్రం ఆ ఘటనపై పంజాబ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తోంది.
ఇదిగో ఈ క్రమంలో ప్రధాని మోడీకి ఎదురైన ఘటనపై స్టార్ షట్లర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పందించారు. దేశంలో ప్రధానమంత్రికే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుందని పంజాబ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. సైనా ట్వీట్ పై స్పందించిన నటుడు సిద్దార్థ్ కాస్త అభ్యంతరకరంగా కామెంట్ చేశారు. సైనా నెహ్వాల్ ట్వీట్ కు సమాధానంగా అసభ్య పదజాలాన్ని వాడాడు సిధ్దార్ధ్.
కాక్ చాంపియన్ ఆఫ్ ది వరల్డ్ అంటూ సైనా మీద సెటైర్లు వేశారు సిధ్దార్ధ్. ఇండియాలో ప్రొటెక్టర్లున్నారు అంటూ కౌంటర్లు వేశారు. సిద్దార్ధ్ వాడిన కాక్ పదం మీద అందరూ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద గాయని చిన్మయి సైతం సిధ్దార్ధ్ కామెంట్ పై స్పందిస్తూ, తప్పు బట్టారు. మరోవైరు మహిళా కమీషన్ కూడా సిధ్దార్ధ్ సైనా నెహ్వాల్ పై చేసిన కామెంట్ పై సీరియస్ అయింది.
కాక్ అండ్ బుల్ స్టోరీ అని చెబుతారు కదా, అలానే ఇది కూడా, మీరుతప్పుగా ఊహించుకోవద్దు.. నేనేమీ ద్వంద్వార్థంలో అనలేదు.. అంటూ సిద్దార్థ్ వివరణ ఇచ్చాడు. కానీ వివాదం మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది. ఈ వివాదంపై సైనా నెహ్వాల్ కూడా స్పందించారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో నాకు సరిగ్గా తెలీదు.. నాకు అతను నటుడిగా ఇష్టం కానీ, ఇది మాత్రం సరైన పద్దతి కాదు.. ఆయన తన భావాన్ని మరింత మంచి పదజాలంతో వ్యక్తీకరించొచ్చు.. అని సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించారు.
Subtle cock champion of the world… Thank God we have protectors of India. 🙏🏽
Shame on you #Rihanna https://t.co/FpIJjl1Gxz
— Siddharth (@Actor_Siddharth) January 6, 2022