నూతన సంవత్సరం రానే వచ్చేసింది. గత రెండేళ్లుగా కరోనాతో ప్రపంచం సతమవుతోంది. ఇలాంటి సమయంలో రాబోయే నూతన సంవత్సరంలోనైనా తమ జీవితాలు ఆశాజనకంగా ఉంటాయని కొత్త ఆశాలు పెట్టుకున్నారు. అందరూ కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు ఆసక్తిగా వుంటారు. అయితే ఇలాంటి వారికి ఓ శుభవార్త. అన్ని రాశుల వారికి కొత్త ఏడాది అనుకూలంగా ఉంటుంది. కానీ జాతక రాశుల ప్రకారం ఈ నూతన సంవత్సరం 5 రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది.
ఆ ఐదు రాశుల వారిలో మొదటి కర్కాటక రాశి వారు. ఈ రాశివారిలో పెళ్లి కాని వారికి ఈ సంవత్సరంలో ఆ ఘడియాలు వచ్చేస్తాయి. ఈ నూతన సంవత్సరంలో వీరు ఏ పనిచేసిన కలిసి వస్తుంది. కనుక ఏప్రిల్ నెల తిరిగే లోపు ఈ రాశి వారి వివాహం నిశ్చయానికి బాటలు పడుతాయి. జూలైలో మీ గృహంలో శని గ్రహం ద్వారా కలిగే అన్ని అడ్డంకులు, సమస్యసలు ముగింపు పలికి వివాహాలకు, ఇతర కార్యాలకు లైన్ క్లియర్ అవుతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది.
సింహ రాశి
సింహరాశి వారికి కూడా ఈ కొత్త సంవత్సరంలో వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ కొత్త సంవత్సరంలో వీరు అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. సమాజంలో వీరికి కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ప్రత్యేకమైన వ్యక్తులు వీరి జీవితంలోకి రావచ్చు. ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మీ జీవితంలో వివాహ బంధాన్ని శని గ్రహం సహాయం చేస్తుంది. కొన్ని విషయాల్లో వీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచి విజయాలు అందుకుంటారు.
కన్యారాశి
కొత్త సంవత్సరంలో కొన్ని గ్రహాలా స్థానాల మార్పు వలన కన్యారాశి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వీరి సమస్యలకు కొత్త ఏడాది ప్రారంభంలోనే పరిష్కారం లభిస్తాయి. ఈఏడాది కన్యారాశి వారికి కూడా వివాహ యోగం మెండుగా వుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో వీరికి గౌరవం మరింత పెరుగుతుంది. ఈ రాశివారికి కొత్త ఏడాదిలో వివాహాలు త్వరగా జరిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాల పట్ల జాగ్రత్త గా ఉండాలి. ఈ రాశి వారు సరైన సమయంలో మంచి నిర్ణాయలు తీసుకుని ఉన్నత స్థానాన్ని పొందుతారు.
వృశ్చిక రాశి
ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అయితే, వీరు భాగస్వామిని కనుగొనడానికి కష్టపడవలసి ఉంటుంది, కానీ జూలై తర్వాత అన్నీ వీరికి అనుకూలంగా మారుతాయి. ఎందుకంటే ఈ సమయంలో శని, బృహస్పతి గ్రహాల ప్రభావం వీరి పై ఉంటుంది. ఈ రాశి వారి సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. చేసే ప్రతి పనిలో విజయదిశగా పయనిస్తారు. ఈ ఏడాదిలో ఈ రాశివారి జీవితంలో కొత్త సంబంధాలు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఈ ఏడాది వశ్చిక రాశివారికి అనుకూలం ఉంటుంది.
మీన రాశి
ఈ రాశివారికి కూడా ఈ కొత్త సంవత్సరం బాగా కలిస్తోస్తుంది. జాతక రీత్యా ఏప్రిల్ తర్వాత బృహస్పతి గ్రహం ఈ రాశిలోకి అడుగుపెడుతుంది. ఇది మీన రాశి వారిలోని పెళ్లి కావాల్సిన వారిపై మంచి ప్రభావం చూపనుంది.కాబట్టి మీరు ఈ సంవత్సరం వివాహం చేసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం తర్వాత త్వరలో వివాహం జరగనున్నందున తమకు సరైన భాగస్వామి కోసం వెతుకుతున్న వ్యక్తులు ఈ సంవత్సరంలో తారసపడి..పెళ్లి జరుగుతుంది. వీరితో పాటు ఇతర అన్ని రాశుల వారికి కూడా ఈ కొత్త ఏడాది అనుకూలంగా ఉంటుంది. కొన్ని సమస్యలను ధైర్యంతో పోరాడితే విజయ సాధిస్తారు.