సినీ హీరోలకు కామన్ పీపుల్స్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉండటం అనేది రెగ్యులర్ గా చూస్తుంటాం. అదే హీరోలలో హీరోలకే డై హార్డ్ ఫ్యాన్స్ ఉండటం అనేది చాలా స్పెషల్. ఎందుకంటే.. జనరల్ గా మీరు ఎవరి ఫ్యాన్? అని ఎప్పుడైనా హీరోలను అడిగితే.. చాలా పేర్లు చెప్పి.. లాస్ట్ లో అందరూ ఇష్టమే అని అంటుంటారు. కానీ.. కొంతమంది మాత్రమే ఖరాకండీగా తమ ఫేవరేట్ స్టార్ పేరు చెబుతుంటారు.
సినీ హీరోలకు కామన్ పీపుల్స్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉండటం అనేది రెగ్యులర్ గా చూస్తుంటాం. అదే హీరోలలో హీరోలకే డై హార్డ్ ఫ్యాన్స్ ఉండటం అనేది చాలా స్పెషల్. ఎందుకంటే.. జనరల్ గా మీరు ఎవరి ఫ్యాన్? అని ఎప్పుడైనా హీరోలను అడిగితే.. చాలా పేర్లు చెప్పి.. లాస్ట్ లో అందరూ ఇష్టమే అని అంటుంటారు. కానీ.. కొంతమంది మాత్రమే ఖరాకండీగా తమ ఫేవరేట్ స్టార్ పేరు చెబుతుంటారు. అలాంటి హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. ఈ మాస్ కా దాస్.. టాలీవుడ్ లో విపరీతంగా అభిమానించి, ఆరాధించే హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇదివరకు కూడా చాలాసార్లు విశ్వక్ ఈ విషయాన్ని చెప్పాడు.. కానీ, వారిద్దరూ కలిసి విజువల్స్ ని మనకు ఎప్పుడు కనిపించలేదు.
ఇక ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో విశ్వక్ సేన్ డ్రీమ్ నిజం కాబోతుంది. విశ్వక్ హీరోగా నటించి, తెరకెక్కించిన సినిమా ‘ధమ్కీ’. మార్చి 22న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ని సాంగ్స్, ట్రైలర్ తో స్టార్ట్ చేసిన విశ్వక్.. రీసెంట్ గా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే.. ఈ ట్రైలర్ ఈవెంట్ లో ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ అనౌన్స్ చేశాడు. ఆల్రెడీ ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలపై చాలా క్లియర్ గా వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చాడు విశ్వక్.
ఈ క్రమంలో విశ్వక్ సేన్.. తన ఫేవరేట్ హీరో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కి కొత్త బిరుదు ఇచ్చాడు. ‘మాస్ అమ్మ మొగుడు’ అంటూ ఎన్టీఆర్ ని సంబోధించాడు విశ్వక్. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి విశ్వక్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతుండగా.. నందమూరి ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. కాగా.. ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 17న జరగనుంది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరై తన ఫ్యాన్ ని, ధమ్కీ సినిమాని విష్ చేయనున్నాడు. ఇక ధమ్కీ సినిమాలో విశ్వక్ సరసన నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. మరి ఫలక్ నుమా దాస్ తర్వాత విశ్వక్ నటిస్తూ, డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. చూడాలి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటుందో..! మరి విశ్వక్ సేన్ ఎన్టీఆర్ ని ‘మాస్ అమ్మ మొగుడు’ అని సంబోధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.