లైగర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా గురించి ఎక్కువగా బజ్ నడుస్తోంది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా బృందం టీజర్, ట్రైలర్, పోస్టర్, లిరికల్ సాంగ్స్ అంటూ ప్రమోషన్స్ ప్రారంభించేశారు. పూరీ జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో జేజీఎం సినిమా కూడా అనౌన్స్ చేశారు. ఈ రెండూ కాక.. వీళ్లిద్దరూ మరో సినిమా కూడా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చిత్రబృందం ప్రమోషన్స్ తో ఎక్కడ చూసినా లైగర్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. యూఎఫ్‌సీ ఫైటర్ గా రౌడీ హీరో కనిపించడం ఇదే తొలిసారి. సినిమాకి సంబంధించి విజయ్ దేవరకొండ బొకే పోస్టర్ ఎంత హైప్ తీసుకొచ్చిందో అందరూ చూశారు. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ– అనన్యా పాండే కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లారు. అక్కడ వాళ్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
A Film that took my everything.
As a performance, Mentally, physically my most challenging role.I give you everything!
Coming Soon#LIGER pic.twitter.com/ljyhK7b1e1— Vijay Deverakonda (@TheDeverakonda) July 2, 2022
తాజాగా విజయ్ దేవరకొండ- అనన్యా పాండేకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ప్రోమో విడుదలైన గంటకే యూట్యూబ్ లో వైరల్ గా మారింది. కాఫీ విత్ కరణ్ షో అంటేనే ఫన్ తో పాటు ఎంతో ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అలాంటి ప్రశ్న ఒకటి విజయ్ దేవరకొండని బాగా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే తేలిగ్గా సమాధానం చెప్పే ప్రశ్న కాదు మరి. అందుకే రౌడీ హీరో నేను సమాధానం చెప్పనంటూ తప్పించుకున్నాడు.
What a day,
24 hours of Madness..
IIII Loveeee youuu ♥️But job not finished yet,
Job just started! 🙂#LigerTrailer#Liger pic.twitter.com/2SaXUXemU0— Vijay Deverakonda (@TheDeverakonda) July 22, 2022
కరణ్ జోహార్ ఏ ప్రశ్న అడిగాడంటే.. “విజయ్ దేవరకొండ నువ్వు లాస్ట్ టైమ్ ఎప్పుడు శృంగారంలో పాల్గొన్నావ్?” అంటూ ప్రశ్నించాడు. అందుకు విజయ్ దేవరకొండ అబార్ట్ అంటూ సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు. కానీ, అనన్యా పాండే మాత్రం నేను సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తా అంటూ.. “ఈ రోజు ఉదయమే పాల్గొని ఉండొచ్చు” అంటూ సమాధానమిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. మరి.. రౌడీ హీరోకి ఎదురైన ఈ ప్రశ్నపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.