ప్రేమ పేరిట జరిగే దారుణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా తమ ప్రేమకు నో చెప్తే.. నర రూప రాక్షసులుగా మారుతున్నారు కొందరు యువకులు. విచక్షణ మరిచిపోయి.. తమను కాదన్న యువతుల జీవితాలను నాశనం చేస్తున్నారు. వారి ప్రాణాలు తీయడానికి సైతం వెనకాడటం లేదు. ఈ క్రమంలో తాజాగా చెన్నైలో ఓ ప్రేమోన్మాది యువతిని కదులుతున్న రైలు కింద తోసేశాడు. దీంతో ఆ యువతి తల ముక్కలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సంఘటనపై ప్రముఖ స్టార్ హీరో విజయ్ ఆంటోని స్పందించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వాడికి కూడా అదే శిక్ష వేయాలని కోరుతూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరలవుతోంది.
విజయ్ ఆంటోని ఈ సందర్భంగా సత్య తరఫున నేను వేడుకుంటున్నాను. ఆమె చావుకు, ఆమె తండ్రి మృతికి కారణమైన దుర్మార్గుడిని శిక్షించడండి. పదేళ్ల తర్వాత వాడిని ఉరి తీయడం వంటి శిక్షలు కాకుండా.. వెంటనే విచారణ జరిపి.. అతడిని కూడా ట్రైన్ కిందకు తోసి చంపండి. సత్యను ఎలా చంపాడో వాడికి.. కూడా అదే శిక్ష పడాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది’’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.
చెన్నైకి చెందిన సత్య అనే 23 ఏళ్ల యువతి ఏటీ నగర్‌లోని ఓ కాలేజ్‌లో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సత్య ఇంటికి కొద్దిదూరంలో ఉండే సతీష్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడి వేధించేవాడు. దీని గురించి సతీష్ తల్లిదండ్రులకు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యాహ్నం కాలేజ్‌కు వెళ్లటానికి సత్య సేయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఇది గమనించిన సతీష్ ఆమెను ఫాలో అవుతూ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. అనంతరం తనను ప్రేమించాల్సిందిగా సత్యతో గొడవపడ్డాడు. ఆమె అంగీకరించకపోవడంతో.. విచక్షణ కోల్పోయిన సతీష్.. వెంటనే పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై వెళుతున్న రైలు కిందకు ఆమెను తోశాడు. రైలు చక్రాల కింద పడటంతో సత్య తల ముక్కలైంది. అక్కడికక్కడే మృతి చెందింది. ఈ వార్త వినగానే సత్య తండ్రి కూడా మృతి చెందాడు. ప్రస్తుతం సతీష్ పోలీసులు అదుపులో ఉన్నాడు.
சத்யாவை கொன்று சத்யாவின் அப்பாவின் தற்கொலைக்கு காரணமான சதிஷை, பொறுமையாக விசாரித்து 10 வருஷத்துக்கு அப்புறம் தூக்குல போடாமல், தயவு செய்து, உடனே விசாரித்து, ரயில்ல தள்ளி விட்டு தண்டிக்கும் படி, சத்யாவின் சார்பாக பொது மக்களில் ஒருவனாக, கனம் நீதிபதி அவர்களை கெஞ்சி கேட்டு கொள்கிறேன்🔴 pic.twitter.com/b8h5CPb4hg
— vijayantony (@vijayantony) October 14, 2022