కార్తీకదీపం, వంటలక్క బుల్లితెర ప్రేక్షకుల్లో ఈ పేర్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ ఛానల్స్‌లో ఎన్నో సీరియల్స్ వస్తున్నా కూడా ఇంకా కార్తీకదీపమే నంబర్ వన్ సీరియల్ గా కొనసాగుతోంది. డాక్టర్ బాబు, వంటలక్క అంటూ లెక్కలేనన్ని మీమ్స్, రీల్స్, టిక్ టాక్ వీడియోస్ రావడం కార్తీకదీపం సీరియల్‌కే సాధ్యమైంది. అలాంటి సీరియల్ లో ప్రస్తుతం వంటలక్క, డాక్టర్ బాబు లేకపోవడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇద్దరమ్మాయిలూ పెద్దోళ్లు అయిపోయారు. ప్రేక్షకులు వంటలక్కను మిస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు చెప్పేది మాత్రం వంటలక్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఇదీ చదవండి: ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ హీరోయిన్
విషయం ఏంటంటే.. వంటలక్క అలియాస్ దీపగా ఫేమస్ అయిన ప్రేమీ విశ్వనాథ్ నందమూరి నటసింహం బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ జోరందుకుంది. యదార్థ ఘటనల ఆధారంగా గోపిచంద్ మలినేని- బాలకృష్ణ కాంబోలో రాబోతున్న చిత్రంలో ప్రేమీ విశ్వనాథ్ కు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. అది కూడా సినిమాలో కీలక పాత్ర అయిన బాలకృష్ణ చెల్లి పాత్రలో వంటలక్క కనిపించబోతోందని తెలుస్తోంది. సినిమాలో అది చాలా ముఖ్యమైన పాత్ర కాబట్టే ప్రేమీ విశ్వనాథ్‌ను సంప్రదించారంటున్నారు. ఈ విషయంపై అధికారిక ధ్రువీకరణ అయితే రాలేదు. వంటలక్కకు బాలయ్య సినిమాలో అవకాశం దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.