సినిమా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు హీరోలు, దర్శక, నిర్మాతల కొడుకులు కూడా హీరోలుగా వచ్చి సక్సెస్ అయ్యారు. అయితే రామా నాయుడు తనయుడు వెంకటేష్, వి.బి.రాజేంద్ర ప్రసాద్ కుమారుడు జగపతి బాబులా ఇతర నిర్మాతల వారసులు సక్సెస్ కాలేదు.
సినిమా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు హీరోలు, దర్శక, నిర్మాతల కొడుకులు కూడా హీరోలుగా వచ్చి సక్సెస్ అయ్యారు. అయితే రామా నాయుడు తనయుడు వెంకటేష్, వి.బి.రాజేంద్ర ప్రసాద్ కుమారుడు జగపతి బాబులా ఇతర నిర్మాతల వారసులు సక్సెస్ కాలేదు. టాలెంట్‌తో పాటు లక్ ఉంటేనే సినిమాల్లో కంటిన్యూ అవగలరు. ఫస్ట్ ఫిలింతోనే బ్లాక్ బస్టర్ కొట్టి, తమిళంతో పాటు తెలుగు యువతలోనూ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని.. ఆ తర్వాత కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోక ఫేడౌట్ అయిపోయిన హీరో ఒకతను ఉన్నాడు. తమిళ్, తెలుగులో అగ్ర, యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ.. రచయిత, దర్శక, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీ సూర్య మూవీస్ అధినేత ఎ.ఎమ్.రత్నం.
ఆయన పెద్ద కొడుకు జ్యోతి కృష్ణను తరుణ్, శ్రియల ‘నీ మనసు నాకు తెలుసు’ తో దర్శకుడిగా పరిచయం చేసి చేతులు కాల్చుకున్న ఎ.ఎమ్.రత్నం.. తానే నిర్మాతగా, రెండో కొడుకు రవి కృష్ణను ‘7G రెయిన్ బో కాలని’ తో ఇంట్రడ్యూస్ చేశారు. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగులో ‘7G బృందావన కాలని’ పేరుతో విడుదలైంది. యూత్ ఫుల్ లవ్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి, హీరో, హీరోయిన్లకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. తర్వాత ఇద్దరికీ వరుసగా అవకాశాలొచ్చాయి. రవి కృష్ణ విషయానికొస్తే.. ‘సుక్రన్’, ‘కేడి’ వంటి కొన్ని తమిళ్ మూవీస్ చేశాడు కానీ అంతగా ఆడలేదు. ‘ముద్దుల కొడుకు’ లాంటి డబ్బింగ్ బొమ్మలు కూడా ఆకట్టుకోలేదు.
తెలుగులో ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’, ‘నిన్న నేడు రేపు’ లాంటి డైరెక్ట్ ఫిలింస్‌లో నటించాడు. రవి కృష్ణ సినిమాలు మానేసి దాదాపు 10 ఏళ్లకు పైగానే అవుతుంది. సక్సెస్ లేకపోవడంతో తెలుగు, తమిళం రెండు చోట్లా ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో క్రమంగా పరిశ్రమకు దూరమయ్యాడు. ఇటీవల ‘7G బృందావన కాలని’ సీక్వెల్ రాబోతుందని.. ఆ మూవీతో తను కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాడని న్యూస్ వచ్చింది కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల రవి కృష్ణ షేర్ చేసిన పిక్స్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. తొలి చిత్రంలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా, భగ్న ప్రేమికుడిగా అలరించి, యూత్ స్టార్ అవుతాడనుకున్న రవి కెరీర్ ఊహించని విధంగా మారిపోయింది.