బుల్లితెర ప్రేక్షకులను దాదాపు పదేళ్లుగా అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్. కొంతకాలంగా జబర్దస్త్ ని ఒకదాని తర్వాత మరోటి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ లో జడ్జిలతో పాటు టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్.. ఆఖరికి యాంకర్స్ కూడా మారిపోతున్నారు. అనసూయ యాంకర్ గా మొదలైన జబర్దస్త్ షో.. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఎన్ని వివాదాలు జరిగినా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడుకూడా కంటిన్యూ అవుతోంది.. కానీ, గతంలో కంటే ఎక్కువగా జబర్దస్త్ పై నెగటివిటీ నెలకొందని అంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్యరావు గురించి కూడా కొన్ని కథనాలు హాట్ టాపిక్ గా మారాయి.
జబర్దస్త్ మొదలైనప్పటి నుండి చాలామంది షోని వీడిపోయినప్పటికీ.. ఇంకా కొంతమంది అలాగే ఉన్నారు. జబర్దస్త్ యాంకర్ గా అనసూయ వెళ్ళిపోయాక.. ఆమె స్థానంలోకి కన్నడ బ్యూటీ, సీరియల్ నటి సౌమ్య రావుని రంగంలోకి దింపారు నిర్వాహకులు. సౌమ్య కూడా వచ్చినప్పటి నుండి వచ్చీరాని తెలుగులో యాక్టీవ్ గా మాట్లాడుతూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే.. ఇప్పుడు జబర్దస్త్ నుండి యాంకర్ సౌమ్య కూడా వెళ్లిపోనుంది అంటూ రూమర్స్ వెలుగులోకి వచ్చాయి. జబర్దస్త్ చుట్టూ వివాదాలు, షోపై నెగిటివ్ కామెంట్స్ పెరిగిపోవడంతో పాటు తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా కారణం అని అంటున్నాయి సినీవర్గాలు.
ఈ విషయంలో నిజమెంతో తెలియదుగాని సౌమ్య మాత్రం బాడీ షేమింగ్ కామెంట్స్ ని ఫేస్ చేసేందుకు సిద్ధంగా లేదట. గతంలో యాంకర్ అనసూయ కూడా షో నుండి తప్పుకోవడానికి డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాటు బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా కారణమని తెలిపింది. సో.. ఇప్పుడు కొత్త యాంకర్ సౌమ్య కూడా అదే ప్రాబ్లెమ్ ని ఫేస్ చేస్తోందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఇవన్నీ ఇబ్బందులు ఎందుకని.. తనకు ఎలాగో సీరియల్స్ ఉన్నాయి కాబట్టి, వాటిపైనే దృష్టిపెట్టే ఆలోచనలో సౌమ్య ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైతే చర్చనీయాంశంగా మారిన ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. మరి జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్, బాడీ షేమింగ్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.