ఇటీవల సోషల్ మీడియా క్రేజ్ తోనే టీవీ షోలు.. సినిమాలంటూ చాలామంది దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్నటిదాకా సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేసుకుంటూ కనిపించిన వారు.. ఇప్పుడు సెలబ్రిటీలుగా సర్ప్రైజ్ చేస్తున్నారు. కొందరికి సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నా.. టీవీ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉన్నా.. సినిమాలలో కనిపించేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అలాంటి వారిలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. బుల్లితెరపై గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ.. ఈ మధ్య వరుస బోల్డ్ ఫోటోషూట్స్, వీడియోలతో అందరి మతులు పోగొట్టింది.
ఈ క్రమంలో మళ్లీ ఏమైందోగానీ.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తగ్గించేసింది. రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు నార్మల్ ఫోటోలు పోస్ట్ చేస్తోంది. కానీ.. రీసెంట్ గా విష్ణుప్రియ – శేఖర్ మాస్టర్ తెరకెక్కించిన ప్రైవేట్ సాంగ్ ‘జరి జరి పంచెకట్టు’తో ఒక్కసారిగా దుమారం రేపింది. ఫొటోలతో మత్తెక్కించే విష్ణు.. ఆ పాటలో సీరియల్ ఆర్టిస్ట్ మానస్ సరసన రొమాంటిక్ స్టెప్స్ తో అందాలన్నీ షేక్ చేస్తూ ఓ ఊపు ఊపేసింది. అయితే.. సెలబ్రిటీలకు వేరే సెలబ్రిటీలపై క్రష్ ఉంటుందనేది విదితమే. అలా విష్ణు ప్రియని నీ క్రష్ ఎవరు? అడిగితే ఓ యంగ్ హీరో పేరు చెప్పి.. కనిపిస్తే నలిపేస్తా అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం విష్ణుప్రియ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇంతకీ విష్ణు ఏ హీరో గురించి మాట్లాడిందని ఆసక్తి చూపుతున్నారు నెటిజన్స్. అయితే.. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ అనే షోలో వేరే కపుల్స్ తో పాటు విష్ణుప్రియ – మానస్ జంటగా పాల్గొన్నారు. టీవీ షోలలో విష్ణుప్రియ రచ్చ ఎలా ఉంటుందో తెలిసిందేగా. అలా యాంకర్ ప్రదీప్ నీ క్రష్ ఎవరని అడగ్గా.. “అక్కినేని అఖిల్.. అతను కనిపిస్తే నాకు..” అని నలిపేస్తానంటూ చేతులతో సిగ్నల్ ఇచ్చింది. దీంతో విష్ణుప్రియ ఆన్సర్ చెప్పిన విధానానికి యాంకర్ ప్రదీప్ తో పాటు షోలో ఉన్నవారంతా షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇక విష్ణుప్రియ చివరిగా ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.