ఇది పెళ్లిళ్ల సీజన్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరో నాగశౌర్య-అనూష, టీవీ నటులు అమర్ దీప్-తేజస్విని, యాదమ్మ రాజు-స్టెల్లా తదితరులు పెళ్లి చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో కూడా వైరల్ గా మారాయి. కేవలం నటీనటులే కాదు క్రికెటర్లు కూడా పెళ్లి చేసుకుంటారు. మరికొందరు మ్యారేజ్ కు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ప్రముఖ నటి కూడా ఎన్నాళ్లో నుంచి ప్రేమించిన ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అవికాస్త వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బుల్లితెర నటి రుషికా మెహతా, యే రిస్తా క్యా కెప్లతా హై, దిల్ దోస్తీ డ్యాన్స్ షోలతో పాపులర్ అయింది. డ్యాన్స్ షోలో శంతనుతో కలిసి ఆమె పండించిన కెమిస్ట్రీ, ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేసింది. ఇక ఈ షో తర్వాత ఇష్క్ బాజ్, యే తేరీ గలియన్, సత్రంగి నసురల్ లాంటి ఇతర షోల్లోనూ కనిపించింది. ఈ ఏడాది ‘కుంకుమ భాగ్య’ సీరియల్ లోనూ అతిథి పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక సీరియల్స్, షోలతో పాటు ట్రూత్ ఆర్ తమన్నా లాంటి మినీ వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేసింది. పలు మ్యూజిక్ వీడియోస్ లోని సాంగ్స్ పాడి గాయనిగానూ గుర్తింపు తెచ్చుకుంది.
ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న రుషిక.. కెనడాకు చెందిన తన ప్రియుడు సౌరభ్ ఘెడియాతో త్వరలో ఏడడుగులు నడవనుంది. ఈ క్రమంలోనే డిసెంబరు 11న తమకు ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందని ఇన్ స్టాలో అనౌన్స్ చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ తోపాటు సహ నటీనటులు వృషికకు విషెస్ చెబుతున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ఏంటనేది త్వరలో వీరిద్దరూ రివీల్ చేయనున్నారు. ఇక సౌరభ్ ఎవరు ఏంటనేది వివరాలు పెద్దగా తెలియవు. అతడు కెనడాలోని టొరంటోలో ఉన్నట్లు మాత్రమే తెలుస్తోంది. మరి రుషిక-సౌరభ్ ఎంగేజ్ మెంట్ ఫొటోలు మీకెలా అనిపించాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.