బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఛానల్ ని చూసి మరో ఛానల్ వినోద కార్యక్రమాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. అలా రీసెంట్ గా మొదలైన టీవీ షోలలో ‘లేడీస్ & జెంటిల్ మెన్’ ఒకటి. స్టార్ యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో.. సీరియల్ ఆర్టిస్టులు, కపుల్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయినవారు జంటలుగా పాల్గొంటుంటారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రోగ్రాం ప్రసారమవుతుంటుంది. కాగా.. ఈ షో నుండి వచ్చే ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. ఇందులో పాల్గొన్న జంటల ఇంట్రడక్షన్ సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రదీప్ యాంకర్ గా ఉంటే షోలో ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. వచ్చే వారం ఎపిసోడ్ లో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మెహబూబ్ దిల్ సే – శ్వేతా నాయుడు, సిద్ధూ – సోనియా సింగ్, యాంకర్ స్రవంతి చొక్కారపు – ప్రశాంత్ జంటలుగా పాల్గొన్నారు. కాగా.. ముందుగా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ – శ్వేతా.. కేజీఎఫ్ 2లో మెహబూబా సాంగ్ కి డాన్స్ చేశారు. అయితే.. డాన్స్ అయ్యాక శ్వేతా మెహబూబ్ దగ్గరికి వచ్చి.. ‘ఏం పీకావని కంగ్రాట్స్ చెప్పడానికి..’ అంది. ఆ తర్వాత దిల్ సే అంటే ఇంటిపేరు అనుకున్నాను అని పంచులు వేసి పరువు తీసింది. ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.