బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అవుతున్నాయి. కానీ ఆ షోల్లో అత్యంత ప్రజాధారణ పొందిన షోలు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఒకటి జబర్దస్త్.. రెండు శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పుకోవాలి. జబర్దస్త్ తర్వాత ప్రారంభం అయ్యింది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ షో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా డిసెంబర్ 19వ తారీఖు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ 100వ ఎపిసొడ్ కావడం విశేషం. ఈ సందర్భంగా కొత్తగా వచ్చిన యాంకర్ సౌమ్యా రావు తో పాటు రష్మీ చేసిన మాస్ డ్యాన్స్ షో మెుత్తానికే హైలెట్ గా నిలుస్తోంది. రష్మీ తనదైన స్టైల్లో మాస్ డ్యాన్స్ తో రెచ్చిపోగా.. సౌమ్యా రావు క్లాసీ లుక్ తో అదరగొట్టింది.
శ్రీదేవి డ్రామా కంపెనీ.. బుల్లితెరపై ప్రేక్షకుల ఆదరణ అభిమానాలను చురగొంటూ.. 100వ ఎపిసోడ్ ను సెలబ్రేట్ చేసుకుంటోంది ఈ షో. ఇక తాజాగా 100వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ఇద్దరు యాంకర్స్ మధ్య పోటీ పెట్టారు. జబర్దస్త్ కు సౌమ్యా లీడర్ గా ఉంటే.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కు రష్మీ లీడర్ గా ఉంది. ఇక ఎప్పటిలాగే హైపర్ ఆది తన పంచులతో రెచ్చిపోయాడు. అనంతరం జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యారావు తన క్లాసిక్ డ్యాన్స్ తో కుర్రాళ్ల గుండెలకు గాయం చేసింది. పుష్ప సినిమాలోని చూపే బంగారమాయనే శ్రీవల్లీ పాటకు తనదైన హావభావాలతో అదరగొట్టింది. లంగాఓణీలో క్లాస్ గా డ్యాన్స్ చేస్తూ.. కవ్వించింది.
అనంతరం రష్మీ కూడా తానేమి తక్కువ కాదు అన్నట్లుగా తన మాస్ డ్యాన్స్ తో స్టేజీని దద్దరిల్లేలా చేసింది. రారా రెడ్డి సాంగ్ కు రష్మీ డ్యాన్స్ కు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజీ మెుత్తం ఊగిపోయిందనే చెప్పాలి. తన మార్క్ మాస్ స్టెప్ లతో ఓ ఊపు ఊపింది. తన నడుము స్టెప్పులతో యూత్ కు చెమటలు పట్టించింది. డ్యాన్స్ కు తోడు కైపెక్కించే చూపులు డ్యాన్స్ కు మరింత అందాన్ని తెచ్చాయనే చెప్పొచ్చు. ఇక ఇద్దరి యాంకర్స్ డ్యాన్స్ చూసిన తర్వాత.. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ వస్తుందా? అని అభిమానులు ఎదురుచూడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరి ముద్దుగుమ్మల డ్యాన్స్ లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.