యూత్ అంతా కూడా సినిమాలు, అందులో హీరోలు స్టార్స్ అని అంటారు. కానీ అసలైన స్టార్స్ అంటే మాత్రం సీరియల్ యాక్టర్సే. ఎందుకంటే ప్రతిరోజూ టీవీలో కనిపిస్తారు. ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంటారు. రెండు నుంచి మూడు గంటల సినిమాలతో పోలిస్తే సీరియల్స్ కు చాలా డెడికేషన్ ఉండాలి. అందుకు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మహిళలు.. సీరియల్స్ ని, అందులో యాక్టర్స్ ని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తుంటారు. అలా తెలుగునాట అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నది అంటే అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ ‘కార్తికదీపం’. గత ఐదేళ్లుగా అలరిస్తూ వచ్చిన ఈ సీరియల్ కు ఫైనల్ గా ఎండ్ కార్డ్ వేసే టైం వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక విషయానికొస్తే.. 2017లో స్టార్ మాలో ‘కార్తికదీపం’ అనే సీరియల్ మొదలైనప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఇందులో హీరోయిన్ దీప డార్క్ కలర్ లో ఉంటుంది. దాని వల్ల ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఆమె భర్త డాక్టర్ బాబు.. పిల్లల విషయంలో ఆమెని ఎలాంటి ఇబ్బందులు పెట్టాడనేది ఈ సీరియల్ స్టోరీ. ఈ రెండు క్యారెక్టర్స్ తోపాటు దీప పిల్లలు శౌర్య, హిమ అనే పాత్రలు, మోనిత అనే డాక్టర్ రోల్ కూడా చాలా కీలకం. ఇక లీడ్ రోల్ చేసిన ప్రేమి విశ్వనాథ్.. తెలుగు ప్రేక్షకుల్ని తన యాక్టింగ్ తో కట్టిపడేసింది. దీంతో ‘కార్తీకదీపం’ సీరియల్ కాస్త తెలుగులో కొన్నేళ్లపాటు టాప్ ప్లేస్ లో కంటిన్యూ అయింది. అయితే సడన్ గా ఈ స్టోరీలో ట్విస్టు పెట్టి డాక్టర్ బాబు-దీప పాత్రలని చంపేశారు.
ఇక సెకండ్ జనరేషన్ స్టోరీ అని చెప్పి ‘కార్తీకదీపం’లో శౌర్య, హిమ పెద్దవాళ్లయిన పాత్రలని చూపించాడు. గతేడాది మార్చి నుంచి కొన్నాళ్లపాటు ఇది టెలికాస్ట్ అయింది. అయితే దీప పాత్ర లేకపోయేసరికి ఆడియెన్స్.. సీరియల్ కు దూరమయ్యాడు. అదే టైంలో మిగతా సీరియల్స్ కు దగ్గరయ్యారు. రేటింగ్స్ కూడా తగ్గిపోయింది. ఇక సీన్ అర్థమయ్యేసరికి ‘కార్తీకదీపం’ ఫ్లాష్ బ్యాక్ పేరుతో దీప-డాక్టర్ బాబు, మోనిత క్యారెక్టర్స్ ని మళ్లీ ప్రవేశపెట్టారు. అయితే అప్పటికే మిగతా సీరియల్స్ కి అడిక్ట్ అయిపోయిన ప్రేక్షకులు.. మళ్లీ ‘కార్తీకదీపం’కి చూశారు గానీ మునుపటితో పోలిస్తే పెద్దగా ఏం లేదని తేల్చేశారు. అయినా సరే ఇప్పటివరకు నడిపిస్తూనే వచ్చారు. మరి ఏమైందో ఏమో సడన్ గా సీరియల్ కు ఎండ్ కార్డ్ వేసేస్తున్నట్లు ఓ ప్రోమోని విడుదల చేశారు. ఈ వీడియోలో దీప-డాక్టర్ బాబు స్వయంగా కొత్త సీరియల్ గురించి ప్రమోట్ చేశారు.
‘కార్తీకదీపం మీకెన్నో మరపురాని జ్ఞాపకాలని ఇచ్చింది. మీ గుండెల్లో మాకు మంచి చోటుని కల్పించింది. ప్రతి గొప్ప కథకు గొప్ప ముగింపు ఉంటుంది. కార్తీకదీపం మీకు నచ్చే ఒక అద్భుతమైన క్లైమాక్స్ తో త్వరలో మీ ముందుకు రానుంది. కార్తీకదీపం క్లైమాక్స్ మరో సరికొత్త సీరియల్ కు నాంది పలుకుతుంది. అదే ‘బ్రహ్మముడి’. మా మీద చూపించిన ప్రేమాభిమానాలు.. కావ్య, రాజులపై కూడా ఇలానే చూపించాలి’ అని దీప-డాక్టర్ బాబు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ‘కార్తీకదీపం’ ఈ శనివారం వరకు మాత్రమే టెలికాస్ట్ కానుంది. సోమవారం నుంచి ఈ సీరియల్ టైంలో ‘బిగ్ బాస్’ మానస్ నటిస్తున్న ‘బ్రహ్మముడి’ ప్రసారం కానుంది. మరి ‘కార్తీకదీపం’ సీరియల్ కు ముగింపు పలకడంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.