ఆర నీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. ఈ పాట దాదాపుగా అందరి తెలుగు వాళ్ల ఇళ్లలో వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే తెలుగు వాళ్లకు ఎంతో ఇష్టమైన సీరియల్స్ లిస్ట్ లో కార్తీకదీపం టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే ప్రారంభమై ఐదేళ్లు దాటిపోయినా కూడా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈ సీరియల్‌కి ఎంత క్రేజ్ ఉంది అంటే.. సినిమా హీరో- హీరోయిన్ల మాదిరిగా ఈ సీరియల్ ఆర్టిస్టులకు ఫ్యాన్ పేజెస్, అభిమాన సంఘాలు ఉన్నాయి. డాక్టర్ బాబు, దీపలు కలవాలని కోరుకోని వాళ్లు లేరంటే నమ్మండి. ఈ సీరియల్ మొత్తంలో డాక్టర్ బాబు, దీపాలే హీరో-హీరోయిన్లు.. మోనితా మాత్రం విలన్ అని అందిరికీ తెలిసిందే. అయితే రియల్ లైఫ్‌లో వీళ్లు ఎలా ఉంటారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.
అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత దాదాపుగా అందరు సీరియల్ ఆర్టిస్టులు తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో జరిగే విషయాలను వీడియోలు తీసి తమ ఛానల్స్ లో పోస్ట్ చేస్తుంటారు. మోనితా, డాక్టర్ బాబులు అయితే వారి గురించి వాళ్ల ఛానల్స్ లో చెబుతూనే ఉంటారు. మోనితా అయితే తాను చేసే షాపింగ్, మేకప్ కిట్లు, వస్త్రధారణ ఇలా అన్ని చూపిస్తూనే ఉంటుంది. ఇంక డాక్టర్ బాబు అయితే తన భార్య, కొడుకుతో కలిసి చేసే అల్లరిని ఎప్పటికప్పుడు తన ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ, అసలు హీరీయిన్ దీప బయట ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. ఆమెకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అప్పుడప్పుడు లొకేషన్‌లో జరిగే ఫన్‌ని వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు.
అయితే ఇప్పుడు వీళ్ల ఛానల్స్ లో కూడా లేని ఒక వీడియో వైరల్‌గా మారింది. అదేంటంటే.. కార్తీక దీపం సెట్‌లో షూట్ గ్యాప్ లో ఆర్టిస్టులంతా ఏం చేస్తారు అనేది అనమాట. నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్, శోభా శెట్టి అంతా కలిసి భోజనం చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆరోజు భోజనం తానే చేసుకొచ్చానంటూ మోనితా చెప్పగా.. అంతా ఆమెను గేళి చేస్తూ ఉంటారు. నీకు అసలు వంట రాదు చూడటం తప్ప అని గోల చేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా వంటలక్క భలే ఆటపట్టిస్తుంది. సీరియల్‌లో ఎప్పుడూ ఎమోషనల్ సీన్స్ చేసే దీప బయట మాత్రం ఎంతో జోవియల్‌గా హుషారుగా తెలుగులో పంచులు వేస్తూ ఆటపట్టించింది. అంతేకాకుండా దీప- మోనితా కూడా సొంత అక్కాచెళ్లెల్లులా మాట్లాడుకుంటూ కనిపించారు. ఇంక డాక్టర్ బాబు అయితే తనదైనశైలిలో పంచులు వేస్తూ నవ్వులు పూయించాడు.