జబర్దస్త్ రోహిణి పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. తెలుగు సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన రోహిణి.. బిగ్ బాస్, జబర్దస్త్ షోస్ ద్వారా మరింత దగ్గరయ్యారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రోహిణి.. ఆ సీరియల్ లో మావ అంటూ ఆమె పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. ఈ జనరేషన్ కి దొరికిన వన్ ఆఫ్ ద బెస్ట్ లేడీ కమెడియన్ అని చెప్పచ్చు. కమెడియన్ గానే కాకుండా.. శ్రీనివాస కళ్యాణం సీరియల్ తో తనలోని రౌద్ర రసాన్ని కూడా బయటపెట్టారు రోహిణి. ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ లో పోలీస్ పాత్రలో కూడా నటించారు. ఆమె నటనకు గాను పలు అవార్డులు కూడా దక్కాయి. సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా హీరోయిన్ స్నేహితురాలి పాత్రల్లో నటించి అలరించారు.
జబర్దస్త్ షోలు, సీరియల్స్, స్పెషల్ ఈవెంట్ లు, స్పెషల్ ఎపిసోడ్ లు ఇలా బిజీ బిజీగా గడిపేస్తున్న ఈమె వీలు చూసుకుని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటారు. రౌడీ రోహిణి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తుంటారు. రకరకాల వీడియోలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఆమె చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తాయి. తాజాగా ఆమె ఒక వీడియో అప్ లోడ్ చేశారు. ఆమె తండ్రికి అదిరిపోయే బహుమతి ఇచ్చి ఆయన్ని సర్ప్రైజ్ చేశారు. తన తండ్రికి ఒక కొత్త బైక్ ను కొనిచ్చారు. ఆమె తండ్రికి ఒక బైక్ మీద తిరగాలన్న కోరిక ఉన్నదట. ఎప్పుడో మాటల్లో రోహిణికి చెప్పారట. అయితే రోహిణి తండ్రి కోరికను నెరవేర్చారు. తమ్ముడితో కలిసి షోరూంకి వెళ్లి.. హొండా షైన్ బైక్ ను కొనుగోలు చేశారు.
అనంతరం ఇంటికి తీసుకొచ్చి.. తండ్రిని పిలిచారు. ఆ బైక్ ని చూసిన ఆమె తండ్రి చిన్న పిల్లాడిలా మారిపోయి మురిసిపోయారు. తన చిట్టి తల్లి తనకు బైక్ కొనిచ్చినందుకు ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత ఆయన రోహిణి తల్లిని ఎక్కించుకుని బైక్ మీద అలా ఒక రౌండ్ వేసి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లల కోరికలు తల్లిదండ్రులు వద్దన్నా తీరుస్తారు, కానీ తల్లిదండ్రుల కోరికలు తెలుసుకుని తీర్చేవాళ్లకే ఒక రేంజ్ ఉంటుంది. తల్లిందండ్రులకి కావాల్సింది కొనిచ్చేవారే హీరో. తన తండ్రికి బైక్ కొనివ్వడంతో రోహిణిని.. రౌడీ రోహిణి కాదమ్మా, నువ్వు హీరో రోహిణి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తండ్రికి బైక్ కొనిచ్చిన రోహిణిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.