తండ్రితో అనుబంధం అనేది మగ పిల్లల కంటే ఆడపిల్లలకు ఎక్కువగా ఉంటుంది. తండ్రి చనిపోతే మగ పిల్లలే బోరున ఏడుస్తారు. ఇక ఆడపిల్లల సంగతి అయితే చెప్పక్కర్లేదు. కానీ జబర్దస్త్ పవిత్ర మాత్రం తన తండ్రి చనిపోతే ఏడవలేదట. చనిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీలయిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.
ఇవాళ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న చాలా మందికి చేదు గతం అనేది ఉంటుంది. చాలా కష్టాలు అనుభవించి, నష్టాలను చూసి, కింద పడి, ఎదురుదెబ్బలు తిని సక్సెస్ అనే సింహాసనంపై కూర్చుంటారు. ఇప్పుడు సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న వారంతా ఒకప్పుడు తమ జీవితాల్లో చీకట్లు చూసినవాళ్ళే. అలా తన జీవితంలో విషాదం నింపుకుని ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన వాళ్లలో జబర్దస్త్ పవిత్ర ఒకరు. జబర్దస్త్ షో ద్వారా లేడీ కమెడియన్ గా అడుగుపెట్టిన పవిత్ర.. పాగల్ పవిత్రగా, జబర్దస్త్ పవిత్రగా ఫేమస్ గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో చేస్తుంది. షోస్ మాత్రమే కాకుండా.. పండగ స్పెషల్ ఎపిసోడ్స్ లోను, పలు ఈవెంట్స్ లోనూ తన కామెడీతో జోష్ నింపుతుంటుంది. తనదైన పంచులతో నవ్వించే జబర్దస్త్ పవిత్ర జీవితంలో కూడా విషాదం ఉంది.
సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె తన జీవిత అనుభవాలను పంచుకుంది. తన తండ్రి ఎప్పుడూ తమను పట్టించుకోలేదని ఆమె వెల్లడించింది. తల్లి ఒక రైతు అని, వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేదని ఆమె తెలిపింది. ఇక నాన్న ఒక లారీ డ్రైవర్ అని.. ప్రభుత్వాన్ని పోషించేవారని, అంటే మద్యం బాగా తాగేవారని పవిత్ర వెల్లడించింది. మూడు పూటలా తినడానికి కూడా అందరం ఆలోచించే వాళ్లమని, ఒకరు ఇంకో పర్సన్ కి సరిపోదేమో అని ఆలోచించే పరిస్థితి ఉండేదని చెప్పుకొచ్చింది. చదువుకోవడానికి డబ్బులు లేక చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది.
తండ్రి చదువు కోసం అయ్యే ఖర్చును పెట్టుకునేవారు కాదని.. తండ్రి నుంచి ఆర్థిక ప్రోత్సాహం ఉండేది కాదని.. దీంతో అమ్మ, పిన్ని తనను చదివించేవారని తెలిపింది. వారికి వచ్చేదే అంతంత మాత్రం. అందుకే వారికి భారం కాకూడదని ఇంటర్ మధ్యలోనే ఆపేసినట్లు ఆమె వెల్లడించింది. అతని తండ్రి ప్రపంచమే వేరని.. ఉద్యోగం చేయడం, తాగడం ఎప్పుడూ ఇదే పని అని పేర్కొంది. ఇంటికి ఎప్పుడూ సరిగా రారని.. వచ్చినా కూడా చాలా తక్కువ సార్లు వస్తారని.. అది కూడా హెల్త్ సమస్యలు ఉంటేనే వచ్చి ఆమె తల్లితో పనులు చేయించుకుని వెళ్లిపోయేవారని.. మళ్ళీ తాగుడు మొదలుపెట్టేవారని ఆమె గుర్తు చేసుకుంది. అయితే ఆమె తండ్రి ప్రేమకు నోచుకోలేదని.. తండ్రిపై ప్రేమనేదే లేదని వెల్లడించింది.
బాగా డ్రింక్ చేయడం వల్ల లివర్ సమస్యతో మంచాన పడి తన తండ్రి చనిపోయారని పవిత్ర గుర్తు చేసుకుంది. ఏడాది క్రితం తన తండ్రి చనిపోయారని.. ‘నేను ఏడవను.. చాలా స్ట్రాంగ్ గా ఉంటాను’ అని చెప్పుకొచ్చింది. తన తండ్రి చనిపోయినప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని చెప్తూనే.. కంటతడి పెట్టుకుంది. మద్యం తాగుతున్నారన్న కారణంగా 13 ఏళ్ళు నాన్నతో మాట్లాడలేదని, ఆయన్ని చూస్తే భయం వేసేదని.. ఆయన ముఖం కూడా చూసేదాన్ని కాదని ఆమె తెలిపింది. మందు మానిపించాలని చాలా ప్రయత్నం చేశామని.. అయితే కుదరలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇక కెరీర్ ఎలా మొదలైందో చెప్పుకొచ్చింది.
ఊళ్ళో చిన్న చిన్న జోకులు వేసి స్నేహితులను బాగా నవ్వించేదాన్నని.. అలా కమెడియన్ అవుతానన్న నమ్మకం ఏర్పడిందని, ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్ వచ్చానని వెల్లడించింది. హైదరాబాద్ లో ఒక సెలూన్ దుకాణం పెట్టుకున్నానని, అయితే సెలూన్ బిజినెస్ సరిగా నడవకపోవడంతో షాపు అమ్మేసి ఆ డబ్బులతో ఊళ్ళో ఇల్లు కొన్నానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే అనుకోకుండా జబర్దస్త్ లో అవకాశం వచ్చిందని ఆమె తెలిపింది. అలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఇవాళ లేడీ కమెడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న జబర్దస్త్ పవిత్ర.. రీసెంట్ గా ఒక కారు కూడా కొనుక్కుంది. మరి తండ్రి ప్రేమకు నోచుకోని పరిస్థితి నుంచి.. చదువు మధ్యలో ఆగిపోయినా సరే తన కెరీర్ ని ఇంత స్ట్రాంగ్ గా నిర్మించుకున్న జబర్దస్త్ పవిత్రపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.