‘జబర్దస్త్’ షో గురించి చెప్పగానే సుడిగాలి సుధీర్- హైపర్ ఆది లాంటి వాళ్లే గుర్తొస్తారు. అంతలా తమ పేర్లు, ప్రేక్షకుల మనసులో రిజిస్టర్ అయ్యేలా చేశారు. ఇక వాళ్ల స్కిట్లలోని పంచులు నెక్స్ట్ లెవల్ ఉండేవి. వాటికొచ్చే వ్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ సుధీర్ పూర్తిగా షో నుంచి వెళ్లిపోయాడు. ఆది,శీను మాత్రం కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి షోలో అడుగుపెట్టారు. వాళ్లొచ్చిన తర్వాత షోపై మెల్లమెల్లగా క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజైన ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ ప్రోమో అలరిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. షో మొదలైనప్పుడు జడ్జిగా ఉన్న రోజా, కొన్ని నెలల క్రితం ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి రావడంతో పూర్తిగా షో నుంచి తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో ఇంద్రజ సెటిలైపోయింది. ఆమెతో పాటు ప్రముఖ హీరోయిన్ ఖుష్బూ కూడా మరో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం జడ్జి ఇంద్రజ సీరియస్ అయింది. దానికి కారణం కెవ్వు కార్తిక్ స్కిట్. జడ్జిల వల్ల టీమ్ లీడర్స్ ఎలాంటి బాధలు పడుతున్నారో ఓ స్కిట్ చేసి చూపించాడు. ఇందులో ఇంద్రజ, ఖుష్బూ పాత్రలని నరేశ్ తో పాటు మరో అమ్మాయి చేశారు.
ఇక ఈ స్కిట్ అనంతరం జడ్జిమెంట్ ఇస్తుందనుకున్న ఇంద్రజ.. ఒక్కసారిగా సీరియస్ అయింది. జడ్జిల వల్ల టీమ్ లీడర్స్ ఎలా సఫర్ అవుతున్నారో ఇందులో చూపించారు కదా, నెక్స్ట్ టైమ్ టీమ్ లీడర్స్ వల్ల జడ్జిలు ఎలాంటివి ఫేస్ చేస్తున్నారో అప్పుడు స్కిట్ చేయండి.. ఈ రెండు స్కిట్ల జడ్జిమెంట్ అప్పుడే ఇస్తానని సీరియస్ గా చెప్పింది. అలా ప్రోమోని కట్ చేశారు. ఇది చూస్తున్న నెటిజన్స్.. నిజంగానే అలా చేశారా? లేదంటే టీఆర్పీ స్టంటా? అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇంద్రజ సీరియస్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: జబర్దస్త్ లో బాడీ షేమింగ్- అడల్ట్ కంటెంట్‌పై స్పందించిన నటి ఇంద్రజ!