బుల్లితెరపై మోస్ట్ ఎంటర్టైన్ మెంట్ షోలలో జబర్దస్త్ తర్వాత అంతటి పాపులర్ అయ్యింది శ్రీదేవి డ్రామా కంపెనీ. దాదాపు రెండేళ్లుగా అలరిస్తున్న ఈ షోలో బుల్లితెర సెలబ్రిటీలతో పాటు జబర్దస్త్ కమెడియన్స్ కూడా సందడి చేస్తుంటారు. యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తున్న ఈ షోలో నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది. కాగా.. ప్రతివారం లాగే ఈ వారం కూడా తర్వాత ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమోలో ఈసారి లేడీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు. సిటీ అమ్మాయిలు వర్సెస్ విలేజ్ అమ్మాయిలు అనే కాన్సెప్ట్ తో ఈ వారం ఎపిసోడ్ జరగనున్నట్లు తెలుస్తుంది. స్టేజ్ పై హైపర్ ఆది అమ్మాయిలపై పంచులు వేస్తూ కనిపించాడు.
ఇదిలా ఉండగా.. ప్రోమో అంతా ఆసక్తికరంగానే సాగింది. ఆద్యంతము నవ్విస్తూనే.. చూపంతా హీరోయిన్ ప్రియా వడ్లమానిపై ఉండిపోయేలా చేసింది. ముఖచిత్రం అనే సినిమా రిలీజ్ అవుతుండగా.. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రియా వడ్లమాని, డైరెక్టర్ సందీప్ రాజ్ తో షోలో హాజరైంది. అయితే.. ప్రియా కనబడగానే హైపర్ ఆది ప్రపోజ్ చేసే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఆది ఇంటెన్షన్ కనిపెట్టిన ప్రియా.. ఆదిని ‘అన్నయ్య’ అని పిలిచింది. దీంతో హీరోయిన్ అన్నయ్య అనేసరికి అవమానంగా ఫీలైన ఆది.. ఆ అవమానం తట్టుకోలేక స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చూడాలి మరి పూర్తి ఎపిసోడ్ లో ఏం జరగనుందో!