తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. ప్రతీవారం ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ కామెడీ షోకి తెలుగు రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఈ షోలో ఇదివరకు ఉన్నటువంటి టాప్ కమెడియన్స్ అంతా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోయాక.. ఇటీవల యాంకర్ అనసూయ కూడా షో నుండి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఎక్ట్రా జబర్దస్త్ కి హోస్ట్ గా ఉన్న యాంకర్ రష్మీనే జబర్దస్త్ ని కూడా హోస్ట్ చేస్తోంది.
ఇక జబర్దస్త్ లో కమెడియన్స్, యాంకర్స్ తో పాటు అప్పుడప్పుడు జడ్జిలు కూడా మారుతుంటారు. ప్రస్తుతం నటి ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా కొనసాగుతోంది. మొన్నటివరకూ సీనియర్ హీరోయిన్స్ ఒక్కొక్కరిగా జడ్జిలుగా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా ఈ వారానికి సంబంధించి కొత్త ప్రోమో వదిలారు జబర్దస్త్ నిర్వాహకులు. ఈ ప్రోమోలో మరో కొత్త జడ్జి ఎంట్రీ ఇవ్వడం విశేషం. నటుడు, కమెడియన్ కృష్ణభగవాన్ ఈ వారం ఇంద్రజతో పాటు జడ్జిగా సందడి చేయనున్నారు. ప్రోమోలో అయితే అందరిపై పంచులు వేశారు భగవాన్. మరి ఇప్పుడు జబర్దస్త్ లోకి కృష్ణభగవాన్ జడ్జిగా రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.