వివాహం అంటే.. ఇద్దరు మనుషులనే కాదు.. రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది. మనిషి జీవితంలో చావు, పుటుకలు ఒక్కసారే వస్తాయి. అలానే వివాహం కూడా జీవితంలో ఒక్కసారే అని భావించేవారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది.. ఈ అభిప్రాయం మారుతూ వచ్చింది. జీవిత భాగస్వామితో ప్రయాణం సజావుగా సాగితే.. సరి. లేదంటే విడాకులు తీసుకోవడం.. నచ్చిన మరో వ్యక్తిని వివాహం చేసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. తాజాగా ఇలా రెండో వివాహం చేసుకుంటున్న వారి జాబితలో స్టార్ హీరో చేరారు. ఆశ్చర్యం ఏంటంటే.. ఆయన రెండో వివాహానికి సిద్ధపడగా.. మొదటి భార్య.. అంగీకరించడమే కాక ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. ఇంతకు ఎవరా స్టార్ హీరో అనేది తెలియాలంటే.. ఇది చదవండి.
ట్రాన్స్ ఫార్మర్స్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ జోష్ దుహమెల్ తాజాగా రెండో పెళ్లికి సిద్ధమయినట్లు ప్రకటించారు. నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని తెలిపారు. జోష్ కు గతంలో ఫెర్గీ అనే మహిళతో వివాహం అయ్యింది. కానీ మనస్పర్థలు తలెత్తడంతో.. 2019లో ఆమెకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత జోష్ కి ఆద్రామరి అనే మోడల్ తో పరిచయం అయి.. అది కాస్త పరిణయానికి దారి తీసింది.
Josh Duhamel announces engagement to Audra Mari — and gets congratulations from ex Fergie https://t.co/XB8nGrhEvN pic.twitter.com/2rdBJWjIhu
— Yahoo Entertainment (@YahooEnt) January 10, 2022
ఈ క్రమంలో ఆద్రామరి పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న తన మనుసులో మాట బయటపెట్టాడు జోష్. నన్ను పెళ్లి చేసుకుంటావా.. అని ఓ లేఖ ద్వారా ఆద్రా ను ప్రశ్నించాడు. అందుకు ఆమె సిగ్గుపడుతూ.. తన అంగీకారం తెలిపింది. ఈ శుభవార్తను జోష్ తన అభిమానులతో పంచుకున్నాడు. నిశ్చితార్థం కూడా అయినట్లు ప్రకటించాడు. ప్రస్తుతం జోష్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జోష్ రెండో వివాహం గురించి అతడి మాజీ భార్య ఫెర్గికి కూడా తెలిసింది. దాంతో ఆమె నూతన జీవితం ప్రారంభించబోతున్నందుకు శుభాకాంక్షలు అని తెలపడమే కాక ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.