ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొంత కాలంగా పలువురు ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. వీరిలో కొందరు బలవన్మరణాలకు పాల్పడగా.. మరి కొందరు అనారోగ్యంతో కన్ను మూస్తున్నారు. ఇండస్ట్రీ ప్రముఖుల మృతితో వారి కుటుంబ సభ్యులే కాక.. అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ ఒకరు మృత్యువాత పడ్డారు. ఓ సినిమాకి దర్శకుడు ఎంత ముఖ్యమో ఎడిటర్ కూడా అంతే ముఖ్యం. దర్శకుడు షూట్ చేసుకొచ్చిన సినిమాని అతడు అనుకున్న విధంగా.. ప్రేక్షకులు మెచ్చెలా ఎడిట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చే బాధ్యత ఎడిటర్ మీదనే ఉంటుంది.
సినీ పరిశ్రమలో చాలా తక్కువ మంది ఎడిటర్స్‌కి పేరొస్తుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందిన ఎడిటర్స్‌లో గౌతమ్ రాజు ఒకరు. అంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన గౌతమ్ రాజు.. సోమవారం రాత్రి 1.30 గంటలకు మృతి చెందారు. ఆయన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమలో దాదాపు 800కి పైగా సినిమాలకి ఎడిటర్‌గా పని చేశారు.
గత కొంత కాలంగా గౌతమ్ రాజు అనారోగ్యంతో బాధపడుతున్నారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 1.30 గంటలకు మరణించారు. గౌతమ్ రాజు మరణంతో టాలీవుడ్‌తో పాటు సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కి గురయింది. ఎన్నో సంవత్సరాలుగా ఆయన వందలాది సినిమాలకు ఎడిటర్‌గా పని చేస్తూ ఎన్నో సూపర్ హిట్స్ అందించి అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. ఇటీవల వచ్చిన సినిమాల్లో ఖైదీనెంబర్ 150, గబ్బర్‌సింగ్, కిక్, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్ లాంటి ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలకి గౌతమ్ రాజు ఎడిటర్‌గా పనిచేశారు.
గౌతమ్ రాజు 1954, జనవరి 15న ఒంగోలులో రంగయ్య, కోదనాయకి దంపతులుకు జన్మించారు. జంధ్యాల తొలి చిత్రమైన నాలుగు స్తంభాలాల సినిమాతో ఆయన తన సినీ కెరీర్‌ని ప్రారంభించారు. గౌతమ్ రాజుకు సంధ్య, సుమాంజలి అని ఇద్దరు కుమార్తెలున్నారు. ఇక గౌతమ్ రాజు మరణంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి సంతాపం తెలియజేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Adire Abhi: అనసూయపై అదిరే అభి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇది కూడా చదవండి: Deepthi Sunaina: ప్రేమపై బిగ్ బాస్ దీప్తి సునైనా ఇంటరెస్టింగ్ కామెంట్స్..!