టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరో ఒకరు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. బుధవారం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఒకరు మృతి చెందారు. అనారోగ్యంతో కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొల్లిపర గ్రామానికి చెందిన సినీ నిర్మాత వీఎస్ రామిరెడ్డి మంగళవారం రాత్రి మృతి చెందారు. రామిరెడ్డి నిర్మాతగా స్టూవర్టుపురం దొంగలు, శత్రువు, లేడీ బ్యాచిలర్స్ వంటి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతగానే కాక.. ఆయన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఇక రామిరెడ్డి మృతి చెందిన వార్త తెలియడంతో.. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.