రాధేశ్యామ్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు. జనవరి 14 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. దర్శకుడు కేకే రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ మూవీ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పని చేశారు. ఇక జస్టిస్ ప్రభాకర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. అయితే.. అందరికీ షాక్ ఇస్తూ తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ వచ్చి జాయిన్ అయ్యారు.
దక్షిణాది భాషలలో రిలీజ్ అయ్యే రాధేశ్యామ్ సినిమాకి తమన్ బీజీఎం అందిస్తాడని యూవీ క్రియేషన్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది కూడా. సినిమా విడుదలకి కొన్ని రోజుల ముందు ఇలా థమన్ చేత బీజీఎం కొట్టించడం ఏమిటి? అసలు ఆ అవుట్ ఫుట్ ఎలా సింక్ అవుతుంది? మూవీ ఏమైనా తేడా కొట్టిందా? అందుకే మళ్ళీ థమన్ ని యాడ్ చేశారా? ఇలాంటి డౌట్స్ అన్నీ డార్లింగ్ ఫ్యాన్స్ ని ఇన్ని రోజులుగా టెన్షన్ పెడుతూ వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఈ విషయంలో రాధేశ్యామ్ డైరెక్టర్ కేకే రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చాడు.
ఇది చదవండి : బ్రేకప్ పై ప్రశ్న.. నెటిజన్ కి హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్
థమన్ ఓ మ్యూజిక్ సెన్సేషన్. నిజానికి గత 45 రోజులుగా థమన్ రాధే శ్యామ్ మూవీకి వర్క్ చేస్తున్నారు. అఫీషియల్ అనౌన్సమెంట్ కాస్త ఆలస్యంగా ఇచ్చాము అంతే. థమన్ సినిమాని అర్ధం చేసుకునే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన రాధేశ్యామ్ మూవీని ఎంతగా ప్రేమించారో.. ఆ బీజీఎం చూస్తే అర్ధం అవుతుంది. థమన్ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో రాధే శ్యామ్ రేంజ్ ని అమాంతం పెంచేశాడు అంటూ దర్శకుడు కేకే రాధాకృష్ణ థమన్ పై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మధ్య కాలంలో థమన్ అఖండ మూవీని తన మ్యూజిక్ తోనే సూపర్ హిట్ గా నిలిపాడు. మరి.. ఇప్పుడు రాధేశ్యామ్ విషయంలో కూడా థమన్ ఇదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.