అఖండ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తున్న సినిమా ఇది. దర్శకుడు బోయపాటి మాస్ పల్స్ కి బాలయ్య జోరు తోడు కావడంతో.. థియేటర్స్ లో మాస్ జాతర కొనసాగుతోంది. ముఖ్యంగా ఇందులో బాలయ్య చేసిన అఘోరా క్యారెక్టర్ సినిమాకి ప్రాణం పోసింది. బాలయ్య నట విశ్వరూపానికి థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ యాడ్ కావడంతో థియేటర్స్ టాప్ లేచిపోతున్నాయి. కేవలం 4 రోజుల్లోనే అఖండ బ్రేక్ ఈవెన్ అయ్యిందంటే బాక్సాఫీస్ దగ్గర బాలయ్య దండయాత్ర ఏ రేంజ్ లో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. మరి.. ఇంత పెద్ద సూపర్ హిట్ అయిన అఖండ సినిమాకి త్వరలోనే సీక్వెల్ రాబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే.., ఇదేదో నమ్మశక్యం కాని వార్తగా చూడలేము. అఖండ సినిమాని ఎండ్ చేసిన విధానం చూస్తుంటే సీక్వెల్ రావడం పక్కా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Feel the trance of Almighty ✨
Om Nama Shivaya 🥁
B-L-O-C-K-B-U-S-T-E-R A-K-H-A-N-D-A 🔥#BlockbusterAkhanda 💥💥💥💥💥 #JaiBalayya 💥#BhammAkhanda 💿💿💿💿 pic.twitter.com/7Pcu1bVVut
— thaman S (@MusicThaman) December 6, 2021
అఖండ సినిమాలో శివుడు అఘోరాగా మారిన విధానాన్ని చూపించలేదు. చిన్న తనంలోనే శివుడు కాశీకి చేరాడు. అక్కడ ఎవరి దగ్గర పెరిగాడు? అతను అక్కడ చెడు అఘోరాలను ఎందుకు మట్టుబెట్టాడు అన్న డీటైల్స్ అన్నీ మిస్ అయ్యాయి. కాబట్టి.. సీక్వెల్ లో అఖండ నేపథ్యం హైలెట్ కానుంది. అలాగే.. అఖండ మొదటి పార్ట్ లో శివుడు కర్తవ్యం ఏమిటంటే.. పాడు బడిన గుడులను మళ్ళీ పునరుద్ధరించడం. ఆ ఆలయాలకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం. ఈ క్రమంలో అఖండకి ఎదురయ్యే సమస్యలు ఏంటి? అన్నది కూడా అఖండ సీక్వెల్ లో చూపించే అవకాశం ఉంది.
ఇక తప్పక మాట్లాడుకోవాల్సింది అఖండ క్లైమ్యాక్స్ ముగించిన విధానం గురించి. ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఈ జన్మకి ఆ లోకమాతే నాకు తల్లి అంటూ అఖండ తన బంధాలు అన్నీ తెంచేసుకుని వెళ్ళిపోతాడు. కానీ.., వెళ్లే ముందు మాత్రం ఆ చిన్న పాపకి మాట ఇస్తాడు. నీకు ఆపద వచ్చిన మరు క్షణం నీ ముందు ఉంటాను తల్లి అని అభయ హస్తం ఇస్తాడు. ఆ మాటని బట్టి చూస్తే అఖండ పునరాగనం ఖాయంగా కనిపిస్తోంది.
And once he steps in.. HISTORYY REPEATSS🔥🔥🔥
Wishing the UNSTOPPABLE #Nandamuri SIMHAM #Balakrishna garu, #MiryalaRavinderReddy garu, dir #BoyapatiSrinu, dearest @MusicThaman and the entire Team #Akhanda an AKHANDous HIT💥💥💥@dwarakacreation @IamJagguBhai pic.twitter.com/U4EHsD6LfK
— Sampath Nandi (@IamSampathNandi) December 1, 2021
అన్నిటిని మించి అఖండ క్యారెక్టర్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిపోయింది. ఈ క్యారెక్టర్ ని బాలయ్య బాబు కంటిన్యూ చేస్తే మరో సినిమా అయినా చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎలాగో.. బోయపాటి- బాలయ్య కాంబో కాబట్టి కచ్చితంగా వర్క్ అవుట్ అవుద్ది. కాబట్టి..2023 లో అఖండ-2 ప్రేక్షకుల ముందుకి రావడం ఖాయంగా తెలుస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.