ఈ మధ్యకాలంలో కొందరి సినిమా హీరో, హీరోయిన్లు, సెలబ్రెటిల చిన్ననాటి ఫొటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది హీరో, హీరోయిన్ల ఫొటోలు సైతం బయటకు రావడంతో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని చూశారు కదా.. మద్దు ముద్దుగా చూస్తూ యువరాణిలా కనిపిస్తుంది. ఈ చిన్నారి ఎవరో కాదు.., ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారును ఓ ఊపు ఊపింది. అసలు ఈ హీరోయిన్ ఎవరు? ఆమె తెలుగులో నటించిన సినిమాలు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తన అందం, అభినయంతో ఈ అమ్మడు కుర్రాళ్ల గుండెల్లో గూడుకట్టుకుంది. తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా.. తనకంటూ ఓ గుర్తింపును మూటగట్టుకుంది. ఏ పాత్రలోనైన ఒదిగిపోయి నటించి నటిగా మంచి మార్కులే కొట్టేసింది. ఆ హీరోయిన్ ఎవరో ఇంకా గుర్తు రాలేదు కదా..! ఆమె ఎవరో కాదండి.. మహాత్మ సినిమాలో శ్రీకాంత్ కు జోడిగా నటించిన భావన మీనన్. ఈ సినిమాలో వచ్చే నీలపురి గాజుల ఓ నీలవేణి అంటూ సాగే ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. సినిమా విజయాన్ని పక్కన బెడితే.. ఈ పాటతోనే భావన బాగా పాపులరిటీని సంపాదించుకుంది. ఇక ఈ భావన మీనన్ ఈ మూవీతో పాటు తెలుగులో ఒంటరి, హీరో, నిప్పు వంటి చిత్రాల్లో సైతం నటించి తన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం కన్నడ, తమిళ్, మళయాళం చిత్రాల్లో నటిస్తూ తెగ బిజీగా మారిపోయింది.