దళపతి విజయ్‌కి భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో హీరో విజయ్ సినిమాలు దాదాపుగా అన్నీ రూ.200 కోట్ల క్లబ్ లో చేరుతున్నాయి. ఏప్రిల్ 13న విజయ్ నటించిన బీస్ట్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ని బీస్ట్ సినిమా డైరెక్టర్ నెల్సన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఒకటి చేశాడు. నెల్సన్ అడిగిన ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు విజయ్ సమాధానాలు చెప్పాడు. తన తండ్రితో ఉన్న విభేదాలు, కుమారుడి ఇండస్ట్రీ ఎంట్రీ, విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఇలా ఎన్నో అంశాలపై స్పందించాడు.
ఇదీ చదవండి: తమ్ముళ్లు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను: మంచు లక్ష్మి
‘అందిరలాగానే నాకు కూడా దేవుడిపై నమ్మకం ఉంది. నేను గుడి, చర్చి, దర్గాలు అన్నింటికి వెళ్తుంటాను. సంజయ్ తెరమీద కనిపిస్తాడా? లేక కెమెరా వెనుక పనిచేస్తాడా? అనే అంశంపై మీతోపాటు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సంజయ్ కి ఆఫర్స్ వస్తున్న మాట వాస్తవమే’. అలాగే తండ్రి చంద్రశేఖర్ తో ఉన్న విభేదాలపై స్పందిస్తూ ‘చెట్టుకు వేర్లు ఎలాగో.. ఓ కుటుంబానికి తండ్రి అలాగ. దేవుడు కనిపించడు. తండ్రి కనిపిస్తాడు’ అంటూ స్పందించాడు.రాజకీయ రంగ ప్రవేశంపై కూడా నెల్సన్ అడిగిన ప్రశ్నకు.. ‘దళపతిగా ఉన్న నేను నాయకుడిగా మారడం అనేది కాలం చేతుల్లో ఉంది. అభిమానులే నిర్ణయిస్తారు. నేను ప్రస్తుతం రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సైకిల్ పై ఓటేయడానకి వెళ్లిన అంశాన్ని కూడా ప్రస్తావించాడు. ‘పోలింగ్ కేంద్ర మా ఇంటి వెనుకే ఉంది. బయటకు రాగానే నా కుమారుడు సైకిల్ పై వెళ్లు అన్నాడు. అందుకే సైకిల్ మీద వచ్చాను. ఆ తర్వాత టీవీలో వార్తలు చూసి ఆశ్చర్యపోయాను. అది యాధృచ్ఛికంగా జరిగిన ఘటన’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం దళపతి విజయ్ కామెంట్స్ పొలిటికల్ ఎంట్రీపై హింట్ అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. అభిమానులైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే విశ్వాసాన్ని వెల్లడిస్తున్నారు. హీరో విజయ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.