వెండితెరపై హీరో, హీరోయిన్ల నటన ఎంత అద్భుతంగా ఉంటే.. ఆ సినిమా అంత హిట్ అవుతుంది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది అంటే చాలు.. మళ్లీ వారిద్దరిని కలిపి ఎప్పుడెప్పుడు వెండితెరపై చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. మరి కెమిస్ట్రీ పండాలి అంటే హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్లు అద్భుతంగా రావాలి. మరి ఇలాంటి రొమాంటిక్ సీన్లలో నటించేటప్పుడు నటీ, నటులు ఏవింధంగా ప్రవర్తిస్తారో చాలా మందికి తెలీదు. ఈ విషయాన్నే తాజాగా వెల్లడించింది మిల్కీ బ్యూటీ తమన్నా. రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు హీరోలు ఎలా ప్రవర్తిస్తారో చెప్పింది.
తమన్నా.. హ్యాపీడేస్ సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. తన అందంతో, నటనతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే గత కొంత కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న తమన్నా.. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బీజిగా ఉంది. ఈ క్రమంలోనే రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు.. హీరోల బిహేవియర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్ సీన్ల షూట్ టైమ్ లో హీరోయిన్లు ఎలా అనుకుంటారో అని హీరోలు తెగ టెన్షన్ పడతారని తమన్నా అన్నారు. ఇక మెుహమాటంగా ఉండే హీరోలు అయితే ఇలాంటి సీన్ల సమయంలో మాట్లాడ్డానికి ఎక్కువ ఇష్టపడరని చెప్పుకొచ్చింది.
అదీకాక రొమాంటిక్ సీన్లలో నటించడానికి చాలా మంది హీరోలు ఇష్టపడరని పేర్కొంది. అంత మంది చుట్టూ ఉండగా.. రొమాంటిక్ సీన్స్ చేయడం అంటే సాహసమనే చెప్పాలని తమన్నా అన్నారు. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం తమన్నా సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ ల్లో నటించడానికి కూడా ఆసక్తి చూపుతోంది. అయితే ఈ ఏడాది మిల్కీ బ్యూటీకి పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. ఈ సంవత్సరం విడుదలైన ఎఫ్3 ఒక్కటే తమన్నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తమన్నా పెళ్లిపై కూడా ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడుపదుల వయస్సు దాటడంతో ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటుంది అని బంధువులతో పాటుగా అభిమానులు కూడా అడుగుతున్నారు.