న్యూ ఇయర్ వేడుకల్లో సెలబ్రిటీలు తెగ హల్ చల్ చేశారు. కొంత మంది ఇక్కడే పార్టీల్లో తమ తమ బాయ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ ఎంజాయ్ చేస్తే.. మరికొంత మంది స్టార్స్ మాల్దీవుల్లో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తమన్నా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ నటుడు విజయ్ వర్మతో కలిసి గోవా న్యూ ఇయర్ వేడుకల్లో కనిపించింది. ఈ పార్టీలో విజయ్ వర్మతో రొమాంటిక్ గా కనిపించింది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే గత కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు షికారు చేస్తున్న క్రమంలో ఈ వీడియో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
తమన్నా.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. గత కొంత కాలంగా తెలుగులో సినిమాలు చేయడం తగ్గించిన ఈ మిల్కీ బ్యూటీ.. బాలీవుడ్ లో వరుస మూవీలు చేస్తూ.. బిజీగా ఉంది. ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ తన సహ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ లో తొలిసారి కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. గతంలో కూడా చాలా సార్లు వీరిద్దరు కలిసి కెమెరా కంటికి చిక్కారు. ఇక విజయ్ వర్మ.. నాని హీరోగా నటించిన ‘ఎంసీఏ’ మూవీలో విలన్ గా నటించాడు.
Shocking 😱😳
Tammy at Private new year party yesterday in Goa with @MrVijayVarma 🔥 @tamannaahspeaks
#TamannaahBhatia #Tamannaah pic.twitter.com/yBjiQL0mrr— ♥️Sneha Tamannaah 😘 💫 (@Tamannaahspeakk) January 1, 2023
దాంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ అప్పట్లోనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో మరోసారి ఈ జంట కలిసి కనిపించింది. ఈ సారి ఏకంగా ముద్దులు పెట్టుకుంటూ.. హగ్ లతో రెచ్చిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అయితే డేటింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు వారు నోరు విప్పలేదు. ఇక ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. ‘కిట్టి’ అనే మలయాళ చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. మరోవైపు విజయ్ వర్మ సైతం వరుసల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నాడు.
@ Tamannaahspeaks dating #VijayVarma They celebrated birthday together and now kissing openly in Goa private party 🥳 pic.twitter.com/uFGUoB4vx8
— ♥️Sneha Tamannaah 😘 💫 (@Tamannaahspeakk) January 2, 2023