అంతేగా.. అంతేగా డైలాగ్ తెలుగు ప్రేక్షకులను ఎంత అలరించిందో అందరికీ తెలుసు. ఎంతో మందికి ఇప్పటికీ అది ఊత పదంలా మారిపోయింది. F2 సినిమాతో కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ అనీల్ రావిపూడిని తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు. ఇప్పుడు F3 అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. పేరుకు సీక్వెల్ గా వస్తున్నప్పటికీ మొదటి సినిమాకి దీనికి ఏ మాత్రం సంబంధం ఉండదని అనీల్ రావిపూడి ముందే చెప్పాడు. ఆ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ మాత్రం యూట్యూబ్ షేక్ చేసిందనే చెప్పాలి. సోషల్ మీడియా ప్రమోషన్స్ కూడా ఓ రెంజ్ లో చేస్తున్నారు.
ఇదీ చదవండి: మహేశ్ బాబు బాలీవుడ్ కామెంట్స్ పై స్పందించిన కంగనా రనౌత్!
ప్రస్తుతం ఈ సినిమా నుంచి విడుదలైన ఓ పిక్ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. F3 సినిమాలో ఉన్న ముగ్గురు హీరోయిన్లు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న పిక్ అది. ఆ ముద్దు గుమ్మలు షూట్ బ్రేక్ సెట్ లో ఒకే దగ్గర కూర్చొని సందడి చేస్తున్న సందర్భంలో తీసిన వర్కింగ్ స్టిల్ అది. F2 సినిమాలో తమన్నా, మెహరీన్ ఇద్దరూ అక్క చెల్లెళ్లుగా చేశారు. F3లో కూడా వాళ్లిద్దరూ అక్కచెల్లెళ్లుగానే ఉన్నారు.. కానీ, ఈ సినిమాలో మాత్రం సోనాలి చౌహాన్ కూడా ఉంది. స్క్రీన్ ఇంకాస్త గ్లామర్ అద్దేందుకు అనీల్ రావిపూడి సోనాలిని కూడా తీసుకున్నట్లు ఉన్నాడు. F3 సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, ఆ వైరల్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.