టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు దక్కించుకున్న నటి సురేఖావాణి. మొదటి నుండి ఓ అక్క, వదిన, పిన్ని, డాక్టర్ ఇలా అన్నిరకాల సైడ్ క్యారెక్టర్స్ లో నటించి మెప్పించిన సురేఖా.. రియల్ లైఫ్ లో రీల్ లైఫ్ కి సంబంధం లేకుండా జీవిస్తుందనే సంగతి అందరికి తెలిసిందే. తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అడపాదడపా తన కూతురులాగే రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటుంది.
ఈ క్రమంలో మోడరన్ మదర్ అనిపించుకున్న సురేఖావాణి.. ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ట్రోల్స్ కూడా ఫేస్ చేస్తూ వచ్చింది. అయితే.. ఇప్పుడు సురేఖావాణి స్టైల్ చూసినట్లయితే రోజురోజుకూ ఆమె వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనే అనుమానం రాకుండా ఉండదు. ఎప్పుడూ నవ్వుతూ ఎప్పటికప్పుడు న్యూ ట్రెండీ లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఓ బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పి మళ్లీ వార్తల్లోకెక్కింది సురేఖ.
ఆ వివరాల్లోకి వెళ్తే.. కూతురు సుప్రీతతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది సురేఖావాణి. ఈ సందర్భంగా తల్లీకూతురు ఇద్దరికీ పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించాడు యాంకర్. అందులో సురేఖావాణి రెండో పెళ్లితో పాటు బాయ్ ఫ్రెండ్ కావాలనే టాపిక్ కూడా బయటపడింది. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అని కూతురిని అడిగిన ప్రశ్నకు.. కూతురితో పాటు తనకు కూడా బాయ్ ఫ్రెండ్ కావాలని తెలిపిన సురేఖా.. కాబోయే బాయ్ ఫ్రెండ్ కి ఫలానా క్వాలిటీస్ కూడా ఉండాలని ఓ లిస్ట్ చెప్పింది. ప్రస్తుతం సురేఖావాణి, సుప్రీతల ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. మరి సురేఖావాణి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.