టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖావాణి. కొన్నేళ్ల కిందట వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సురేఖా.. ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం తగ్గించేశారు. సినిమాలైతే తగ్గించింది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. అయితే.. సోషల్ మీడియా విషయంలో సురేఖావాణి ఒక్కరే కాదు.. ఆమె కూతురు సుప్రీతతో కలిసి రచ్చ చేస్తుంటారు.
ఇక ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా తన కూతురు సుప్రీతను ఫ్యాషన్ గా పెంచుతోంది. ఇప్పటివరకు సుప్రీత సినిమాలైతే చేయలేదు కానీ సోషల్ మీడియా ఫాలోయింగ్ లో తల్లినే మించిపోయింది. ఈ మధ్యే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లో కనిపించి సందడి చేసింది. అదీగాక సుప్రీత సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ మెయింటైన్ చేస్తోంది. అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంటున్న సుప్రిత త్వరలోనే వెండితెరపై కనిపించనుంది.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘లేచింది మహిళా లోకం’ సినిమా ద్వారా సుప్రీత డెబ్యూ చేయనుంది. ఈ సినిమాకు కార్తీక్ – అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. తాజాగా మంచు లక్ష్మి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో సినిమా పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే చిత్ర యూనిట్ కి విషెష్ చెప్పింది. కాగా ఈ సినిమాలో సుప్రీతతో పాటు హరితేజ, హేమ, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తానికి సుప్రీత సినీ ఎంట్రీ చేయనుంది. ఆమె ఫ్యాన్స్ కూడా ఎంతో కాలంగా వెండితెరపై సుప్రీతను చూడాలని కోరుకుంటున్నారు. మరి మరి సుప్రీత పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.