Suma Kanakala: దశాబ్ధంపై కాలంగా తెలుగులో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు ‘సుమ కనకాల’. ఆ ఛానల్ ఈ ఛానల్ అని తేడా లేకుండా పదుల సంఖ్యలో టీవీ షోలు చేశారు.. చేస్తున్నారు. సినిమాల్లో నటన, టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లతో బిజీబిజీగా ఉండే ఆమె కొత్తగా యూట్యూబ్‌లోకి అడుగుపెట్టారు. ‘సుమ’ పేరిట ఓ యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. 2021 మే 30న ఈ యూట్యూబ్ ఛానల్‌ను స్టార్ట్ చేశారు. నాలుగున్నర లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నారు. సుమ తనకు సంబంధించిన అన్ని రకాల వీడియోలను అందులో పోస్ట్ చేస్తూ వీక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా, ఆమె హోస్ట్ చేస్తున్న ‘క్యాష్ షో’కు సంబంధించిన వ్లాగ్‌ను వీడియో చేశారు. క్యాష్ ప్రోగ్రామ్ షూటింగ్ ఉన్న రోజు సుమ ఏం చేస్తుంది? షూటింగ్‌లో ఆమె ఎలా తయారవుతుంది?… సెట్స్‌లో ఎలా ఉంటుంది? ఇలాంటి అన్ని విషయాలను వీడియో తీసి పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్‌లో ఉంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nandamuri Taraka Ratna: నా తమ్ముడు Jr.యన్టీఆర్ లా చేయాలని అనుకోను! తారకరత్న సంచలన కామెంట్స్!