Suma Kanakala: దశాబ్ధంపై కాలంగా తెలుగులో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు ‘సుమ కనకాల’. ఆ ఛానల్ ఈ ఛానల్ అని తేడా లేకుండా పదుల సంఖ్యలో టీవీ షోలు చేశారు.. చేస్తున్నారు. సినిమాల్లో నటన, టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లతో బిజీబిజీగా ఉండే ఆమె కొత్తగా యూట్యూబ్‌లోకి అడుగుపెట్టారు. ‘సుమ’ పేరిట ఓ యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. 2021 మే 30న ఈ యూట్యూబ్ ఛానల్‌ను స్టార్ట్ చేశారు. నాలుగున్నర లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నారు. […]