సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెరపై ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. మ్యుజిషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఈరోజు లక్షల మంది అభిమానులను సంపాదించుకునే స్థాయికి సుధీర్ ఎదగడం నిజంగా చాలా గొప్ప విషయం. అయితే.. సాధరణ సుధీర్ ని.. సుడిగాలి సుధీర్ గా మార్చి.. ఇంతటి స్థాయిని కట్టబెట్టింది మాత్రం కచ్చితంగా జబర్దస్త్ షోనే. ఈ స్టేజ్ పై నుండే సుధీర్- రష్మీ జోడీ పుట్టుకొచ్చింది. తరువాత కాలంలో ఈ జంట ఎంతటి ఆదరణ దక్కించుకుందో అందరికి తెలుసు. అయితే.. గత కొంతకాలంగా సుధీర్ జబర్దస్త్ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇక అప్పటి వరకు సుధీర్ హోస్ట్ గా చేస్తూ వచ్చిన షో కూడా రష్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే సుధీర్- రష్మీ మధ్య గ్యాప్ పెరిగిపోయింది అన్న వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే.. తాజాగా సుధీర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇలాంటి రూమర్స్ కి బ్రేక్ వేసినట్టు అయ్యింది.
సుడిగాలి సుధీర్ హీరోగా “గాలోడు” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ శుక్రవారం “గాలోడు” మూవీ ప్రేక్షకుల ముందుకి రాగా.. చిత్ర బృందం ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచింది. ఇందులో భాగంగానే సుధీర్.. రష్మీతో తన అనుబంధంపై పెదవి విప్పాడు. “గాలోడు సినిమాకి హీరోయిన్ గా ముందు రష్మీనే అడిగారు. కానీ.., డేట్స్ కుదరక తాను ఈ మూవీ చేయలేకపోయింది. 10 ఏళ్లుగా మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతూ వస్తోంది. దీంతో.. అంతా మా బాండింగ్ గురించి అడుగుతూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి నాకు ఆన్ స్క్రీన్ లో కూడా రొమాన్స్ ఇష్టం ఉండదు. ఒక్క రష్మీతో మాత్రమే ఆ మ్యాజిక్ సెట్ అయ్యింది. దీనికి ఓ కారణం కూడా ఉంది. నేను ఎప్పుడూ.. రష్మీని ముట్టుకోను, పట్టుకొను. కేవలం కళ్ళతోనే మా ఇద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్ది. ఇన్నేళ్ళుగా బుల్లితెరపై మా జంట సక్సెస్ కావడానికి ఇదే కారణం.
ఇక 6 నెలలుగా జబర్దస్త్ కి దూరంగా ఉంటూ వస్తున్న సుధీర్ త్వరలోనే ఈ షోలో కనిపించబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ” నేను సినిమాలు చేసినా.., టీవీ షోలు చేసినా ప్రేక్షకులకి దగ్గరగా ఉండటానికి మాత్రమే. యాజమాన్యంకి చెప్పే జబర్దస్త్ నుండి 6 నెలలు బ్రేక్ తీసుకున్నా. త్వరలోనే మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తా. షోలు హోస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ ఏ అవకాశం లేకుంటే మళ్ళీ మ్యాజిక్ షోలు చేయడానికి కూడా నేను సిద్దమే” అంటూ సుధీర్ చెప్పుకొచ్చాడు. దీంతో.. సుధీర్- రష్మీ మళ్ళీ దగ్గర కాబోతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది.