భారత గానకోకిల లతా మంగేష్కర్.. శాశ్వతంగా కనుమూయడంతో సంగీత ప్రపంచం మూగబోయింది. కొన్ని దశాబ్దాలుగా లతా మంగేష్కర్ తన మధురమైన గాత్రంతో సినీలోకాన్ని, సంగీత ప్రియులను అలరిస్తూ వచ్చారు. నిన్నటితో ఆమె శకం ముగియడంతో.. ఆమె అభిమానులంతా బాధాతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు తెలియజేస్తున్నారు.
కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడిన లతా మంగేష్కర్.. త్వరగా కోలుకోవాలని ప్రార్థించని వారులేరు. ఇక ఆమె మృతికి నివాళి అర్పిస్తూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. లతా మంగేష్కర్ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరీ బీచ్ లో సుదర్శన్.. లతా మంగేష్కర్ కి ట్రిబ్యూట్ అంటూ.. ‘ఇండియన్ నైటింగేల్.. మేరీ ఆవాజ్ పెహచాన్ హై!’ క్యాప్షన్ జోడించాడు.లతా మంగేష్కర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు కూడా సుదర్శన్.. ‘గెట్ వెల్ సూన్ లతా దీదీ’ అని ప్రార్థిస్తూ సైకత శిల్పాన్ని రూపొందించాడు. ప్రస్తుతం మూగబోయిన గానకోకిలకు నివాళిగా సుదర్శన్ సైకత శిల్పం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతావని సంగీత ప్రియులంతా లతా మంగేష్కర్ మృతికి నివాళులు అర్పిస్తున్నారు. మరి సుదర్శన్ సైకత శిల్పాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.