టాలీవుడ్ లోకి ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అందులో చాలా తక్కువ మంది అంటే ఒకరో ఇద్దరో మాత్రమే బలంగా నిలబడతారు. వారే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటారు. మిగిలిన వాళ్లు.. మీడియం రేంజ్ హీరోలతో నటిస్తూ కాస్త బిజీగానే ఉంటారు. కొందరు మాత్రం అలా వచ్చి ఇలా మాయమైపోతారు. తీరా ఇప్పుడు వాళ్లని చూస్తే కచ్చితంగా షాకవుతాం. ఇలాంటి బ్యూటీస్ నా తెలుగు దర్శకులు పట్టించుకోనిది అని తెగ ఫీలైపోతాం. అలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టులో చాలామంది భామలు ఉంటారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న భామ పేరు నేహా పెండ్సే. ఈ పేరు చెప్పగానే ఎవరీమె? తెలుగులో ఏ సినిమాలో నటించింది అనే డౌట్ వస్తుంది. కానీ టాలీవుడ్ లో ఇప్పటికీ ఎప్పటికీ హిట్ సినిమాగా పేరు తెచ్చుకున్న ‘సొంతం’ మూవీలో నేహా చేసింది. తెలుగులో ఇదే ఆమెకు తొలి సినిమా. ఆ తర్వాత గోల్ మాల్, వీధిరౌడీ అనే మరో రెండు చిత్రాలు చేసింది. కానీ పెద్దగా పేరు అయితే రాలేదు. దీంతో హిందీ, మరాఠీలో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. 2020లో చివరగా హిందీ, మరాఠీలో తలో సినిమా చేసింది.
1995 నుంచి సీరియల్స్ చేస్తున్న ఈ భామ.. ఇప్పటికీ వాటిలో నటిస్తూనే ఉంది. ప్రస్తుతం ‘బాబీజీ ఘర్ పర్ హై’ అనే సీరియల్ చేస్తోంది. ఇక ఈమె మ్యారీడ్ లైఫ్ విషయానికొస్తే.. దాదాపు ఏడాది పాటు డేటింగ్ చేసిన తర్వాత బాయ్ ఫ్రెండ్ శార్దుల్ సింగ్ తో 2020 జనవరి 5న ఏడడుగులు వేసింది. ఇక పెళ్లి చేసుకుంది, సీరియల్స్ చేస్తుంది అని సైలెంట్ గా ఏం ఉండట్లేదు. ఇన్ స్టాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. నేహాని ఇప్పుడు చూస్తున్న తెలుగు ప్రేక్షకులు.. ఈమె లాంటి బ్యూటీని టాలీవుడ్ డైరెక్టర్స్ పట్టించుకోనిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.