ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆట డ్యాన్స్ రియాలిటీ షో ఫస్ట్ సీజన్ విన్నర్ టీనా(38) మృతి చెందింది. ఓంకార్ నిర్వహించిన ఆట డ్యాన్స్ షోతో టీనా చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత సీజన్ 4కి జడ్జిగా కూడా వ్యవహించిన విషయం తెలిసిందే. ఆవిడ గోవాలో మృతి చెందింది. అయితే ఆమె మరణానికి అధిక రక్తపోటుతో గుండెపోటు వచ్చినట్లుగా చెబుతున్నారు. టీనా సాధు మృతిచెందినట్లు ఆట సందీప్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా సడెన్ మరణించడంపై సర్వత్రా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: విశాఖ పెళ్లికూతురు మృతిలో ట్విస్ట్! పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఊహించని నిజాలు!
అయితే ఇప్పుడు టీనా సాధు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమెది సహజ మరణమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోవాలో ఉన్న టీనాసాధు అధిక రక్తపోటు వల్ల గుండెపోటు రాడవంతో మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే ఆమె గోవా ఎందుకు వెళ్లింది? ఎంతకాలంగా గోవాలో ఉంటోంది? అంత చిన్న వయసులో గుండెపోటు రావడం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు హైబీపీ రావడానికి కారణం ఏమై ఉంటుంది అంటూ అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఆమె గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.