తన మధుర గాత్రంతో సింగర్ గానే కాక.. డబ్బింగ్ తో కూడా ఏళ్ల తరబడి ప్రేక్షకులను అలరిస్తున్నారు సింగర్ సునీత. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెర మీద సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సునీత.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చిన్న వయసులోనే వివాహం, భర్త నుంచి విడిపోవడం.. ఆ తర్వాత ఒంటరిగా ఇద్దరి పిల్లల బాధ్యతలను చూసుకుంటూ.. కొన్నేళ్లు గడిపేశారు. అయితే గతేడాది జనవరి 9 న రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు సునీత. పెళ్లైన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే.. ఈ విషయం క్లియర్ గా తెలుస్తుంది.
ఇది కూడా చదవండి : ఆ బాధను తట్టుకోలేక రాత్రంతా ఏడ్చాను
ఈరోజు సునీత-రామ్ ల మొదటి వివాహ వార్షికోత్సవం. ఈ నేపథ్యంలో సునీత సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘మనం ఆశలన్నీ వదులుకున్నప్పుడు ప్రేమ వెతుక్కుంటూ మన దగ్గరకి వస్తుంది. మా ఇద్దరి విషయంలో అదే జరిగింది. ప్రతి పెళ్లి వెనుక ఓ కథ ఉంటుంది’ అంటూ తమ పెళ్లికి సంబంధించిన కొన్ని మెమొరీస్ ను వీడియో రూపంలో షేర్ చేశారు సునీత.
ఇది కూడా చదవండి : రామ్‌ను పెళ్లి చేసుకోవటానికి అదే కారణమంటున్నారు..!
ఇందులో సునీత పెళ్లి సమయంలో తీసిన కొన్ని బిట్స్ ను వీడియోగా తయారు చేశారు. ఇందులో సునీత తన భర్త రామ్ గురించి గొప్పగా మాట్లాడారు. అతడు చాలా నిజాయతీపరుడని.. ఏ విషయాన్నైనా సూటిగా చెబుతాడని.. మొత్తానికి.. రామ్ మంచి కాఫీ లాంటి అబ్బాయ్ అంటూ మురిపోయారు సునీత. అంతేకాక ఆమె పిల్లలు, తల్లిదండ్రులు, రామ్ కుటుంబ సభ్యులు సునీత మీద ప్రశంసలు కురిపించారు. ఆ వివరాల కోసం వీడియో చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.