ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ నేపధ్య గాయని సునీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సునీత పాటలను వినని వారు, ఆమె గొంతుని ఇష్టపడని వారు ఉండరంటే అతియోశక్తి కాదేమో. అవును మరి సునీత గొంతు అంత మధురంగా ఉంటుంది. ఇక సునీత ఎప్పుడూ సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటుంది. కానీ మొన్న సునీత రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్నాక.. మరింత ఉత్సాహంగా ఉంటోంది. పెళ్లి తరువాత సునీతలో రెట్టింపు ఉత్సాహాన్ని చూస్తున్నాాం. అవకాశం దొరికితే చాలు సునీత సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం అవుతోంది ఈ మధ్య. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటోంది. ప్రస్తుతం జీ తెలుగు చానెల్‌లో సునీత డ్రామా జూనియర్స్ షో తో అభిమానులను అలరిస్తోంది. ఇక సునీత హఠాత్తుగా ఇన్ స్టాగ్రాంలో ప్రత్యక్ష్యం అయ్యారు. కరోనా నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. కాసేపు అందరిని తన మాటలు, చిన్న చిన్న కూని రాగాలతో అందరిని రిలాక్స్ చేశారు.
ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో అభిమానుల ప్రశ్నలకు ఓ పక్క సమాధానాలు చెబుతూనే.. మరో పక్క వారు కోరిన పాటలన్నీ లైవ్ లో పాడి వినిపించారు. తన భర్త రామ్ తో తన జంట బావుందని కొనియాడిన అభిమానులకు సునీత ధన్యవాదాలు తెలిపారు. లైవ్ లో సునీత పాడిన మధురమైన పాటలకు అంతా మైమరిచిపోయారు. ఇక కరోనా పెరుగుతున్న సమయంలో ఎక్కువగా బయటకు వెళ్లకండి.. తప్పనిసరి అయితేనే బయటకు వెళ్లండి.. మన పొట్ట పోషించుకోవాలి.. అలాంటప్పుడు బయటకు వెళ్లాల్సిందే.. కానీ జాగ్రత్తగా ఉండండి.. మాస్కులు ధరించండి.. భౌతిక దూరం పాటించండి.. ఇలా నేను పాడుతుంటే కొంతమందైనా తమ బాధలు మరిచిపోయి సంతోషంగా ఉంటారంటే ప్రతీ రోజూ రాత్రి ఇదే సమయానికి ఓ అర్దగంటపాటు లైవ్‌లోకి వస్తాను.. రోజూ పాటలు పాడుతాను అని సునీత అభిమానులకు చెప్పారు సునీత. సో.. సునీత చెప్పినట్లు ఎవ్వరూ అవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. వెళ్లినా మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండండి.