ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత, స్టార్ సింగర్ రేవంత్ కు, అతని పాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ తన మార్క్ చూపించాడు సింగర్ రేవంత్. ప్రస్తుతం జీ తెలుగులోని సరిగమప సింగింగ్ కాంపిటీషన్ లో ఓ టీమ్ కు మెంటర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. షో నిర్వాహకులు ఉగాది పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి రేవంత్ తన భార్యను తీసుకొచ్చాడు. ఫిబ్రవరి నెలలో అన్విత గంగరాజు అనే యువతిని రేవంత్ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం చేయడమే తప్ప.. బయట ఏ కార్యక్రమానికి తీసుకురాలేదు. తాజాగా జీ తెలుగు కార్యక్రమంలో తన ‘ఈవిడ నా భార్య అన్విత’ అంటూ పరిచయం చేశాడు. ప్రస్తుతం ఆ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: ఘనంగా సింగర్ రేవంత్ పెళ్లి.. వైరల్ గా మారిన ఫోటోలు..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.