శేఖర్ మాస్టర్.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ దూసుకుపోతున్నారు. టాప్ హీరోల సినిమాలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. బుల్లితెరపై పలు షోల్లో జడ్డీగా ఉంటూ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వీటితో పాటు నిర్మాతగా మారి తన యూట్యూబ్ ఛానల్ లో వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. ఇక శేఖర్ మాస్టర్ పిల్లలు సాహితి, విన్నీ. వీరిద్దరు కూడా మంచి డ్యాన్సర్లు. వాళ్ళు కూడా చాలా షోలలో తమ డ్యాన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు. కూతురు సాహితి డ్యాన్సర్ గానే కాక ఫ్యాషన్ బొటిక్ కూడా నడుపుతోంది. కాగ.. శేఖర్ మాస్టర్ కూతురు పేరుపై ఇన్ స్టాలో కొన్ని ఫేక్ ఐడీస్ పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెట్టే పని చేశారు శేఖర్ మాస్టర్.
సోషల్ మీడియాలో ప్రముఖల పేర్ల మీద ఫేక్ ఐడీ అకౌంట్స్ వస్తుంటాయి. అలానే ఇటీవల శేఖర్ మాస్టర్ కూతురు సాహితి పేరు మీద ఇన్ స్టాలో అనేక ఫేక్ అకౌంట్స్ వచ్చాయి. వీటిపై సీరియస్ అయిన శేఖర్ మాస్టర్.. ఈ ఫేక్ అకౌంట్స్ తీసేయాలని వార్నింగ్ ఇచ్చాడు. అయినా చాలా ఫేక్ అకౌంట్స్ వస్తుండంతో.. నిన్న తన కూతురికి అధికారికంగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని క్రియేట్ చేశాడు. ఈ విషయంపై శేఖర్ మాస్టర్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“నా కూతురి పేరుతో చాలా ఫేక్ అకౌంట్స్ వస్తున్నాయి. అందుకే అఫిషియల్ గా మేమే ఓ అకౌంట్ క్రియేట్ చేశాము” అని ఆ అకౌంట్ ని వీడియోతో పాటు పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్. దీంతో మాస్టర్ అభిమానులు అందరూ సాహితి అకౌంట్ ని ఫాలో అయ్యారు. సాహితి.. అకౌంట్ క్రియేట్ చేసిన కొన్ని గంటల్లోనే 21 వేల మంది ఫాలోవర్స్ రావడం విశేషం.