శర్వానంద్ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాక్టింగ్, డ్యాన్స్.. అన్ని రంగాల్లో మంచి టాలెంట్ ఉన్న హీరో శర్వానంద్. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరోల జాబితాలో శర్వానంద్ పేరు కూడా ఉంది. కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో శర్వానంద్ పెళ్లి ప్రస్తావన రాగా.. ప్రభాస్ తర్వాత చేసుకుంటాను అంటూ కామెంట్స్ చేశాడు. అయితే బాలయ్య ఏముహుర్తాన.. శర్వానంద్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడో కానీ.. ఈ యువ హీరో పెళ్లి వార్త ప్రసుత్తం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ అమ్మాయిని శర్వానంద్ వివాహం చేసుకోబోతున్నాడని.. త్వరలోనే పెళ్లి డేట్ ప్రకటిస్తారని వార్తలు ప్రచారం అవుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఇన్విటేషన్ లెటర్ ఒకటి వైరలవుతోంది. దీనిలో శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు.. ఎంగేజ్‌మెంట్ తేదీ.. వెన్యూ తదితర వివరాలు అన్ని ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే.. శర్వానంద్ వివాహం చేసుకోబోయే అమ్మాయి పేరు పద్మ అని తెలుస్తోంది. ఇక జనవరి 26న.. పార్క్ హయత్‌లో శర్వానంద్ నిశ్చితార్థం జరగనుందని దీనిలో ఉంది.
ఈమె రెడ్డి సామాజికి వర్గానికి చెందిన అమ్మాయి అని.. ఈమెకు కూడా రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం. పైగా ఆమె రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. శర్వానంద్ వివాహం చేసుకోబోయే యువతి.. ఓ మాజీ మంత్రి మనవరాలు అని సమాచారం. శర్వానంద్ పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
శర్వానంద్.. 2003లో విడుదలైన ‘ఐదో తారీఖు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాలలో చిన్నచిన్న పాత్రల్లో కనిపించాడు. ఆ తర్వాత చిరంజీవితో థమ్స్ అప్ యాడ్‌లో నటించడమే కాకుండా.. ‘శంకర్ దాదా MBBS సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత వెంకటేష్‌తో ‘సంక్రాంతి’, ‘లక్ష్మి’ చిత్రాల్లో హీరో తమ్ముడు పాత్రలో నటించాడు. ఇక వెన్నెల సినిమాలో సైకో పాత్రలో నటించి.. అందరిని మెప్పించాడు.
ఇక శర్వానంద్, అల్లరి నరేష్ నటించిన గమ్యం సినిమాతో తెలుగు, తమిళంలో మంచి గుర్తింపుతో పాటు.. విజయం అందుకున్నాడు. ప్రస్థానం సినిమా.. శర్వానంద్ కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇక శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అక్కినేని అమల ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.