మెగాస్టార్ చిరంజీవి సేవా దృక్పథం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికే సహాయం కావాలన్నా వెంటనే నేనున్నానంటూ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటారు. ఇండస్ట్రీలో అయినా, సొసైటీలో అయినా ఎవరికి కష్టమొచ్చినా తన వంతు ఆర్ధిక సాయం చేసి కష్టాన్ని తొలగిస్తారు. తనను తిట్టిన వారికి సైతం మాట సాయమో, మూట సాయమో చేయగల మెగా మనసున్న మారాజు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి చిరంజీవి గురించి స్వయంగా దగ్గరుండి చూసిన వాళ్ళు చెబితేనే గాని తెలియదు. తాజాగా సీనియర్ నటుడు బెనర్జీ మెగాస్టార్ చిరంజీవి సేవా దృక్పథం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినిమా వాళ్ళ కోసం ‘మా’ ప్యానల్ మెంబర్స్ అందరం కలిసి ఒక ఓల్డేజ్ హోమ్ కడదామనుకున్నామని, ఆ విషయాన్ని చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లామని బెనర్జీ అన్నారు.
దానికి ఆయన.. “డబ్బులు గురించి ఏమీ ఆలోచించకండి. నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. గవర్నమెంట్ తో మాట్లాడతానా? ఎవరి దగ్గర నుంచి అయినా తెస్తానా? ఏం చేస్తానా? అనేది ఆలోచించకండి. మంచి ప్రాజెక్ట్ ఇది. మీరైతే ఓల్డేజ్ హోమ్ గురించి ప్లాన్ చేయండి. సినిమా ఆర్టిస్టులు మాత్రమే కాకుండా 24 క్రాఫ్ట్స్ లో ఇక వీళ్ళు పని చేయలేరు అనే వాళ్ళని ఈ ఓల్డేజ్ హోమ్ కి షిఫ్ట్ చేద్దాం. వాళ్ల చివరి శ్వాస వరకూ ఫుడ్డు, షెల్టర్, మెడిసన్ వంటివి ఉచితంగా ఇద్దాం” అని చిరంజీవి అన్న మాటలను గుర్తు చేశారు. అయితే తాము ఫాలో అప్ కాకపోవడం వల్ల ఈ ఓల్డేజ్ హోమ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని నటుడు బెనర్జీ అన్నారు. మళ్ళీ అన్నయ్య దృష్టికి తీసుకెళ్తే అవ్వకుండా ఉంటుందా? మరి చిరంజీవిపై బెనర్జీ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.